మరొక వాక్యరహిత ప్రేమలేఖో, లోకమో
విస్తరించే వైరాగ్య శాంతి శోక ఛాయే, అపరచితం
మేలు లేదు ఎన్ని పదాలతో, మైత్రించినా
శంకించే స్నేహం మరో రూపంలో, రహస్యమే
విధి అనురాగ ధన్యతే, వేదన
దృశ్య భావన ఫలాల నృత్యం, ఓ లేత వలయం
ఒకానొక అవస్థ, వినోదం
సంభాషించే నేత్ర పరిచయం, అదృశ్యం
మంత్రించే మిత్రుత్వం, మౌనమే
ఇదో వింత విలాప మైకం, నువ్వే లేకపోతే
స్వర్గం పృథ్విపై ఉన్నా సుఖం, లేదు
దేహాతీతంగా కొన్ని ఋతువులు, మృగ్యం
ఇప్పటి బంధనాలు నాకు బహు, దూరం
4 comments:
'వేదన దృశ్య భావన ఫలాల నృత్యం, ఓ లేత వలయం'.... చాలా బావుంది. మీ కవితల్లో ఇతర మానవ అనుభూతులను సైతం చోటివ్వండి. 'తనకు ప్రపంచానికి సయోధ్య కుదిరేదాకా కవి చేసే అంతర బహిర యుద్ధారావమే కవిత్వం' అనే భావనను మరోసారి మీ కవిత్వంలో ఆవిష్కరించాలని ఆసిస్తూ......
నాయుడూ నేను కవిత్వాన్ని చదివి కేవలం ఆనందించగలను. విశ్లేషించే శక్తి నాకు లేదు. నీ కవిత్వం చదివి అర్థం చెప్పమంటే రంగు, రుచి లేని అక్షరాలను ఎగరేయడమే. పొగడ్తల సభలను వినీవినీ విసిగిపోయినవాడిని. అలా చేసి నిన్ను అవమానించలేను. నిత్యమూ పూచే పూలకి, పిలవకుండానే వీచే గాలులకి అభినందనలు అక్కర్లేదు. పాడటం నీ లక్షణం. అది నీ ఆత్మయొక్క శరీరం. ఈ దీపాన్ని ఎంతదూరమైనా తీసుకునిపో.
ఏమిటీ కవిత్వం. జోరున వానకురిసినట్లు. చదివినవారు ఈ వర్షంలో ఇరుక్కుపోతారు. ఇంటికిపోలేక అకాలపు తడవడంలో ఇమడలేక నీలా నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతారు. ఇంటికి వెళ్లేదాక. వెళ్ళడంకోసం. ఇది చదివి ఎంతో దూరం వెళ్ళిపోయి ఎవరికీ అందే స్థితిలో లేకవడం. ఇదొక భాషలేని కవిత్వం. ఇక వివరణ విశ్లేషణ అర్థరహితం.
దూరం వెళ్ళిపోవడమేకాని ఎడారి ఇసుకతెన్నెలమీద తెగిన పక్షిలా పడిపోవడం. ఇది ప్రతిక్షణానికీ పగిలే జీవచ్చవ కెరటాల మధ్య సజీవ జలాల ఊపిరాడని సుడిగుండం. నువ్వు అందరికీ అలా కనిపించినా, అందరూ నీకలా అనిపించినా ఉన్నదదేకదా తెర. దేనినీ అంగీకరించలేని ఎండుటాకు చూపు కొట్టుకుపోవడం.
kotta pada bandhalu ee kavitaloni bahavaanni paripushtam chesayi.mee anni kavithallo chikka danam perigindi. abhinandanalu.
naidugaru mi poetry has reached new heights. i need some time to comment. i need a new vocabulary to respond to the poetry
jagadeesh
Post a Comment