సరికొత్త నీడలు
ఏవో ఙ్ఞాపకాలై
ఎర్రగా చతికిలపడి
గుడిగంటని దాటుకుంటుా
నల్లటి కల
సరికొత్త నిశ్శబ్దం
తొలకరి రాత్రి
తప్పనిసరికాని చీకటి
సరికొత్త మౌనం
సరికొత్త నీడలు
ఏవో ఙ్ఞాపకాలై
ఎర్రగా చతికిలపడి
గుడిగంటని దాటుకుంటుా
నల్లటి కల
సరికొత్త నిశ్శబ్దం
తొలకరి రాత్రి
తప్పనిసరికాని చీకటి
సరికొత్త మౌనం
పదం ఎగిరిపోతోంది. ఎగరని ఖననం. ఎందుకో ఎవరో చుాసిన నిశ్శబ్దం. అప్పనంగా. అర్థనగ్నంగా. అక్షరాలన్నీ సంపూర్ణ
నగ్న అక్షరాలేనా. శరీరానికే అక్షరం. తొడుగు. తొడుగు. తొడలే లేని రాత్రి. గదిలో, ప్రేమతో విలపించకు. అదో విషం. అదో నిష. తత్వవేత్త వెలిగించే మాటలు మూర్ఖంగా కనిపించలేదా.
ఎన్ని చెవులు నీలో.
ఎన్ని నాలుకలు నీలో.
దారితప్పి
వొచ్చిన ఇంద్రియాలతో
నువ్వే శరీరాన్ని వెతుకుతూ ఉంటావ్.
తలలూపే అక్షరాలమధ్యే ఇంకెంత కాలం
ముద్దుముద్దుగా ముద్దగా.
కాని సొంత రచన, ఓ సొంత
విసుసుసుసుసుసుసుగు మనసు. అంతకన్నా ఏ కంటి కలా లేదుదుదుదుదు. కొన్ని అక్షరాలు ఈ కాగితంపై కనిపించకపోతే చాలు.
కలలో ఉండని నిద్ర
నిద్రలో వుండని కలే కావాలి
చనిపోయే చీకటినే చుాడాలి.
రాదు. మరో మనసు.
ఒక మనసే. ఎన్ని అంగాలో. ఎవరి అంగాలో. అంగాంగాల మనసు. నీదే. కానే కాదు.
మరో రాత్రిలోకి, రాత్రే రాకపోతే, రాత్రే, ఎక్కడో. అదే దారం. అదే అద్దం. అదే పేగు. అదే ముఖం. అదే నిశ్శబ్దం కాదు. ఎన్నటికీ.
ఈ పదాల బయట
ఏదీ కనిపించదు. దాయాలి.
గాయాలని గుండెకి నేర్పాలి
కలలు తెరిచే కళ్ళతో
కోవిడ్ రాత్రి ఇంకా వుంది.
ధ్యానం, ధ్యాస
ఆలోచనల రొంపి కోసమేనా
.
ఆకాశంలో సమాధి నీడ కింద, ఆమె నవ్వని నవ్వు వింటావ్. నివాళి పదాలు పేరుస్తావ్. ఎవరూ చూడని కొమ్మపై ఓ పాత చినుకు, ఓ పాత పిట్ట కనిపిస్తాయి నీకే. పువ్వులకోసం ఎదురుచూసే సుఖద్రోహమేదో చెట్టులో దాగుంటుంది. ధ్వని ఓ కాయం. చిల్లిగవ్వలేని నిద్రలో, కల. అదో నొప్పంతే. వేలిముద్రల నవ్వు. నొప్పి, కృష్ణహరితంగా. క్రూర శాంతీ! నీ ముఖం ఎంత బలహీనం. పిరికివాడి పిడికిలి రంగేంటి. మై వన్ అండ్ ఓన్లీ demoక్రసీ, దేశీక్రసీ, ఆ కలే లేదు, ఆకలే లేదు ఎవరికీ, నాలుకలే లేవు ఎవరికీ. అరలు అరలు ప్రతి అక్షరంలో. ఎవరివవి. వాటి పొదల పొరల్లో పారవశ్య ప్రార్థనల్ చేసేయ్. నల్లటి తాత్విక తాప తపస్సులు. మాండలిక కుండలినీ ఆటంకాలు. స్మార్ట్ ఆర్ట్ మురికి. మోక్ష విచారం.
అలిఖిత వైద్యం. నిశ్చల రూపాలన్నీ అవమానాలే. హార్టో పోర్టో పడవ తేలదు. జ్ఞాపకాలే, మింగు. ఆటల మాటలలో దిగబడి, ఏ బడిలో, ఏ ఏలుబడిలో మునుగుతావ్. గట్టిగా గుట్టుగా కన్నీటిని పిసుకు. నినాదాలే నిరూపాలవ్వాలి. మహాద్రోహీ! నోళ్ళు మూసుకునే అతిగా నిద్రపోతుంటాం. కలలకి పురిటినొప్పులు రానివ్వం. మా నోట్లోనే కలలుంటాయ్. నోరిప్పమ్. చావొచ్చినా. వెన్నెముకలేని ఆసుపత్రి ఎగురుతోంది.
పారేసేవే ఎక్కువ, పదాల మధ్య ఉండే వాక్యంలో. వాటి కాటికాపరే ఏ కాలెండర్లోనూ చనిపోడు. ఎదలేని నీడ ఎదురవ్వదు. మరో చీడ పురుగు కొత్త లంగోటీతో. దైవత్వం, ఎవరి సంకలోనో నవ్వుతుంటుంది. నిరుక్త పరిమళాలు సంతోషద్వేషంలో.
ప్రతి అక్షరంలో సొంత కురుపు
a special silence
పదాల్లో ఏముందో
నేలపై కొన్ని ఊపిరులు తిరిగాయి
ఒంటరినే
అట్లాస్లో లేని రోజుల్ని
అందుకని, అందాలన్నీ అందుకోనివని కంటికి కన్నీరు చెప్పదు.
అని, అనలేక
గది వరదలో కలలులేని కలలు
ఏ ఎక్కడ చనిపోయానో
ఏ చీకటో
కన్నీరే నిలవని కంటితో
ఇంకా, ఇక చుాసేదంతా
కనులు లేనోడినే