Blog Archive

Followers

Wednesday, December 03, 2014

నగ్నసమాధి


నల్లటి ముఖాలపై నల్లటి నవ్వుల కురుపులు 
కడుపులోని నల్లటి కలలపై నువ్వుల మెరుపులు 
మెడలోని కణితి కంటిలోకి సూర్యుడి చినుకులు 
తొడలోని తోకకి తామరాకుల నీడలు 
చనిపోయాక కూడ ఏమి చదువుతారు 
రాయటానికి అక్షరాలేమైనా నగ్నసమాధులా 

Sunday, October 19, 2014

శ్వాస

నీడల నిదుర  వెదురు గాలిలో 
ఉన్నపళంగా తోవ దొరక్క

తెలియని బోసి పెదాలు 
నమ్మని అద్దాలు 

నిష్కపట కృతాంతుడా
నీ గది బైట నిలబడింది నువ్వేనా 

ఊరడించే అపరాధాలే ఆధారం 
లోహవాయువు ఆరాధనలో 

లోభీ!
కళ్లపై కలల కనికట్టు అట్టిపెట్టు 

ఒంటె పాదాల నేత్రాలతో 
నాలోకి రా 

Tuesday, April 29, 2014

మౌనద్వారం

ఆకస్మిక cosmic చిరునవ్వు
నిన్నే ఎందుకు ముద్దుపెట్టుకుంది 

దుఃఖకౌగిలి వ్యాకరణంలో వాత్సల్యవాయువు 
నిన్నే ఎందుకు చుట్టుముట్టింది
వ్యసననయనాలతో అశ్రువులు 
నిన్నే ఎందుకు చూశాయి
నిర్జీవమైన పదాల్లోకి
నిన్నే మనసుశ్వాస ఎందుకు ఊపిరితీసుకుంది
రంగుల్లేని గాలి 
నిన్నే ఎందుకు పిలిచింది నిర్బింబ అశూన్యంలోకి
ఇక కలవరపడకులే... 
రేయింబవళ్ళు లేవు 
భగవంతుడు లేడు 
శబ్దాలు లేవు 
కన్నీళ్లు లేవు

నీ స్నేహపు దారి 
ఎందుకు మూసేసావు యకాయకి 

                                                                  - రామిశెట్టి విజయకృష్ణకి

Friday, April 04, 2014

గాలిని మింగాను

కావాలనే కదూ 

కల ఇవతల చనిపోయావు 



కలవలేని కలపలేని 


కన్నీటి కనికరం


ఎందుకులే 



సువాసనే 


దుఃఖంది 



హత్తుకున్న ఖాళీ 


హృదయం ఏ ప్రేమదో 



కోరిన కోరిక 


కానుకై వస్తే 


అది మనసుశ్వాసే 



నిద్రలేక గాలిని మింగాను

Thursday, April 03, 2014

మృగమౌనం

bathos or pathos

కొన్ని అంతే మింగుడు పడవు
పడుపు పడవల వలల పడవ కడుపు అంతే 
అంతా ఓ అల
ఓ మృగమౌనం

తెరవని తలుపు తెలుసు
తెరిచినా తలుపులోని తెర తెలియని
గాలి గాజు మిగిలి

పారదర్శకత ఓ వ్యసనం

Wednesday, March 12, 2014

ఆఖరి ఖాళీ

ఎందరో నిద్రపోతున్న సమాధుల్లో
ఇష్టంలేని నిద్రతో ఎందుకు వెళ్ళానో


కన్నీటికైనా తెలిసిందా

ఖాళీశ్వాస అక్షరాలతో
ఖాళీయోని ప్రేమతో
అద్దంలో చూడని అద్దంలో
అందం ఏ శ్మశాన సువాసనో


నీటి ఎముకలు పగిలి

Friday, January 31, 2014

బతకాలి

నేత్రాలు వొకోసారి రావు 

నీడలే నీడలకి నీడ 



యెన్నాలైనా ముగిసిపోని 


పనికిమాలిన మూర్ఖత్వం 



అరచేతుల్లో కాస్త నిద్ర 


హృదయం లేదు 



నువ్వే నువ్వే 


శ్వాసాంత దుఃఖరేణువువి 



అనువాదం రాదు 


కన్నీళ్లు కన్నీళ్ళపై కనిపిస్తే