Followers

Wednesday, April 22, 2020

|| ప్రతీక్ష ||

దహన ప్రయాణంలో
ఆకారాలకి అక్షరాలు దక్కవు

ఎంత చిన్న పదం, ప్రేమ
ఎదురయ్యే దుారం, ఎంత పెద్ద పదం
సజీవం, వృధా జ్ఞాపకాలే

అపరిష్కృత అహం
బహు కురచ

Friday, April 17, 2020

శ్వాస శాసనం

పోయిందో
ఏకాకి వల

దాగే దగా దగ్గరితనం
జారిపోయే ఎముకలు

ఎప్పటి అపురూప శాపమొ
ఆపలేని వరం

కాస్త కాలంలోనే తిరిగే
అముద్రల నిదుర కలత

కలుషిత రక్తపు అంతరిక్షమోక్షం
యే వలకీ దొరకని

ఖాళీకటాక్షం
వెంపర్లాడే రాత్రి అల

సుథలొలికే అరణ్యం
కొంచెం పిలిపించుకుంటావ్

వగలమారి ఋణమరణ దృశ్యాల్ని
దారి మరచిన ఆఖరి నేల

చీకటి వుాపిరి ముగిసే సమయం
ఎగిరే గదులు సంచరించే హింస