Followers

Wednesday, December 05, 2012

నవ్వే నాలుక

స్థనంలో శ్మశానం 

ఏదీ సరిగ్గా లేదు 

ఓ వెలుగు నీటిలో 
బందీ ఘటనలు 

తిరిగి తిప్పలేని అనుభవాలు 

ముక్కులోంచి మూత్రం
మోక్షంలోంచి మోహం 

చీదర చీదర చింతల చలి 

ఆకార అనుమానాలే
ఆక్రందనాస్మృతులు  

ప్రశ్న మరణదేహంతోనా 
అప్రశ్న మరణంతోనా 

అదృశ్య అధీనంలో

ఆ కిటికీ లేదు 
పూల కిరీటాల గాలీ లేదు 

మరపునిచ్చే ఆకార  అక్షరాలూ లేక
ఏ యంత్ర యాత్ర యోనిలోనో తపస్సులోనో నువ్వుంటావ్

అదృశ్య అధీనంలో ఆధార అశ్రువై
మూగ ముఖంతో కనిస్పిస్తావంతే 

ఇరుకిరుకు ఇంద్రియాల ఇంద్రజాలం 
ఓ విన్యాస విధ్వంసం 

మరో ఇమడని పగటిలో 
పొలమారిన ఊహలు 

ఎవరూ ఉండని అద్దంలో 
ఎవర్ని వెతుకుతావ్ 

చీకటి చేతుల్తోనే తెరవాలి 
కిటికీనైనా, గాలినైనా