Followers

Saturday, June 24, 2017

రాయట్లేదు

వినే వుంటావ్ 
వినే వుండవ్ 
అచేతన ప్రతిశ్రుతుల్ని 

ప్రత్యక్ష ప్రకోపనకారీ
కరుచుకుని కరచుకొను కంపనలకై 
కన్నుకప్పు కరుణ 
నాలుగు నీలుగు మాటల్లో 

మొఱ్ఱిఅక్షరాల ప్రేమలో 
ధ్వనిబంధువు ఎప్పటికీ ఉదాహరణే 

ప్రసూతిలీల నీదే 

మాటలెక్కడో దూరంగా 
నీవై వుండవు
మౌనమెక్కడో అతి సమీపంలో 
నీలో ఎవరితోనో 

పెదాలు నీడలై 
అనుభవానికీ కనిపించక 
ఆకృతులులేని ప్రశ్నలు నవ్వాయి 

కన్నీటిని దాచుకునే కళ్ళు ఎవరికున్నాయి 
ప్రతిబింబాల శాపగ్రస్తులం 

పాతదే ఈ కల 
రేపటి అద్దమే 
మరో రంగై 

వానలో నిద్రని తాకానో లేదో
నీడలన్నీ
పాదముద్రల్ని మరిచాయి 

అక్షరాల ఉయ్యాలఫై నీటి సూర్యుడు 
మెరుపు 
మౌనమై అంటుకోదు కంటికి
వేలాడదు మనసుకి 

పాదాలపై చినుకులు 
తూనీగలై గుచ్ఛుకుంటున్నాయి 

ప్రాచీనమైన ప్రేమ క్షీణిస్తుంటే
ప్రేమికులే ఇంకా ద్వారపాలకులై 

ముట్టడించే మెత్తటి మరుపు 
యెంత దూరంలో యింకెంత మరణంలో 

తెరిచినా కదలని పదం 
నీటిలో మంటలో గ్రహణశబ్దం 

దాగాను అడ్డమైన అద్దంలోపల 
ఏ తర్వాతో తెరిచిన చీకటి 

మాటల్లో ప్రవేశించిన మాటలు 
పెదవిపై నడవలేవు 

గోడలే కావలి మాటలకి 
కావాలనే కదూ మాటలు పేరుస్తావు 

జ్ఞాపకాలు క్షమించవు 
తిరుగుబోతులవి 

బహిష్కృతుడా 
నిద్రించే వాక్యాలతో
నినదించలేవు 
ఏ అపూర్వాన్నీ 

మరో మధురలీలలో అభావం 
అనుభవతాండవంలో 

కాంక్షించే అమృతమాయేదో 
ప్రలోభశాపం కట్టెదుట 

నేరంలేదెక్కడా 
శాంతి స్వప్నాలే 
ప్రతి మనిషిలో 

విచార చరణాల వలస విలాసం 
మనసులో చరచర కరకర గరగర 

గుమిగూడిన పరమానంద వరాలు
పారిపోయే నీడలు 

చెల్లని చల్లని నాణెం 
నుదిటిపై కన్నీటిపై 

ephemera

సంక్షోభం అసలే రాదు
ఆత్మహత్యలు చేసుకోరు
ఏ చరిత్రకీ బలహీనత రాదు
ఏ మతానికీ బలహీనత రాదు
ఏ సిద్ధంతానికీ బలహీనత రాదు
దారితప్పే సత్యమే ప్రభుభక్తి
భుక్తిభక్తే సత్యాస్థిత్వం
రుణమాఫీ
రణమాఫీ
మరణమాఫీ
లోతట్టు పదాలే
మాడిన అశ్రువులై
వాంతుచేసుకుని జెండాలెగరేస్తాయి
ఆటవిక ఆత్మతో
ఏ లోపలా లేక
ఏ లోపాలు లేక
ఏ లోకం లేక
నాని నాని
కుళ్ళిన మోక్షంలో
జైకొట్టు బైకొట్టు మరో
లజ్జాతీత రోజుకు

నీలం

చెరిపేసేయ్
చేరి రాసే కళ్ళని, వొళ్ళునీ
చప్పరించు అక్షరాల్ని
మరణాల్నీ
చర్మేంద్రియాల్ని,
ధర్మేంద్రియాల్నీ
నాకు
చరాచర చితితో
చరచరా
తప్పించుకునే తడబాటుల గాలి
తడి బాటలే లేని జీవితం
జన్మించే హృదయం లేదిపుడు
వీక్షించే మౌనం వేధించదు
మోసం చేసేయ్
దరికి రాని ప్రేమతో
ఒకానొక ప్రేమి
విధేయ రాహిత్యంతో జీవించి