వినే వుంటావ్
వినే వుండవ్
అచేతన ప్రతిశ్రుతుల్ని
ప్రత్యక్ష ప్రకోపనకారీ
కరుచుకుని కరచుకొను కంపనలకై
కన్నుకప్పు కరుణ
నాలుగు నీలుగు మాటల్లో
మొఱ్ఱిఅక్షరాల ప్రేమలో
ధ్వనిబంధువు ఎప్పటికీ ఉదాహరణే
ప్రసూతిలీల నీదే
మాటలెక్కడో దూరంగా
నీవై వుండవు
మౌనమెక్కడో అతి సమీపంలో
నీలో ఎవరితోనో
పెదాలు నీడలై
అనుభవానికీ కనిపించక
ఆకృతులులేని ప్రశ్నలు నవ్వాయి
కన్నీటిని దాచుకునే కళ్ళు ఎవరికున్నాయి
ప్రతిబింబాల శాపగ్రస్తులం
పాతదే ఈ కల
రేపటి అద్దమే
మరో రంగై
వానలో నిద్రని తాకానో లేదో
నీడలన్నీ
పాదముద్రల్ని మరిచాయి
అక్షరాల ఉయ్యాలఫై నీటి సూర్యుడు
మెరుపు
మౌనమై అంటుకోదు కంటికి
వేలాడదు మనసుకి
పాదాలపై చినుకులు
తూనీగలై గుచ్ఛుకుంటున్నాయి
ప్రాచీనమైన ప్రేమ క్షీణిస్తుంటే
ప్రేమికులే ఇంకా ద్వారపాలకులై
ముట్టడించే మెత్తటి మరుపు
యెంత దూరంలో యింకెంత మరణంలో
తెరిచినా కదలని పదం
నీటిలో మంటలో గ్రహణశబ్దం
దాగాను అడ్డమైన అద్దంలోపల
ఏ తర్వాతో తెరిచిన చీకటి
మాటల్లో ప్రవేశించిన మాటలు
పెదవిపై నడవలేవు
గోడలే కావలి మాటలకి
కావాలనే కదూ మాటలు పేరుస్తావు
జ్ఞాపకాలు క్షమించవు
తిరుగుబోతులవి
బహిష్కృతుడా
నిద్రించే వాక్యాలతో
నినదించలేవు
ఏ అపూర్వాన్నీ
మరో మధురలీలలో అభావం
అనుభవతాండవంలో
కాంక్షించే అమృతమాయేదో
ప్రలోభశాపం కట్టెదుట
నేరంలేదెక్కడా
శాంతి స్వప్నాలే
ప్రతి మనిషిలో
విచార చరణాల వలస విలాసం
మనసులో చరచర కరకర గరగర
గుమిగూడిన పరమానంద వరాలు
పారిపోయే నీడలు
చెల్లని చల్లని నాణెం
నుదిటిపై కన్నీటిపై
No comments:
Post a Comment