అరంగులు
అనీడలు
ఆడంగుల చరిత్ర
అద్దంలో చౌరస్తా
ఆలస్యం దొరకదు
అందంలో అందని ఆనందం
మాటల్లో పొందని మౌనం
వలస దోస్తులే
వాన కళేబరాలై
అతికించే పదాలే ఊపిరితీస్తాయి
అతకని నీరై
గడవని గదై
బతికుండే వింత
సదృశ్య ఖాళీ
యే మెలికల వర్ణమో
యే మలుపుల నిశ్శబ్దమో
దోబూచులాడాయి
ఆనుకున్నా, అనుకున్నా
వెలితాక్షరాల స్వప్నస్వేచ్ఛ
వొగరు నిద్రేదో యెగిరిపోయింది
జరిపిపోతాం
కాసిన్ని కానని బొమ్మల్లాంటి బొమ్మల్ని
గీసుకునే దురదేదో
కంటిలో గీరుకుంటోంది
- మోహన్ గారికి
No comments:
Post a Comment