Followers

Saturday, July 11, 2020

abstract pronoun

చెవిటి కళ్ళకి చెవిటి రంగులు

రంగురంగుల చెవులు
ప్రతి రోజుా విచ్చుకుంటాయ్

వికృత మనిషికి యేదో ప్రేమ కావాలి
నాలుక ఒక కప్ప

అవినయశీలీ!
ఊరించే ఊపిరిలిపి ఉలిక్కిపడుతోంది

యెందుకుందో సర్వనామం
యెందుకుందో అద్వైతం

జారిపోయే ఖాళీ నీడలు
జారిపోయే ఖాళీ దేహాలు

వాక్యమొక చర్మం   గళమొక పత్రం మరణమొక వర్షం  వయసొక తీరం

ప్రేమించటం కొందరికి నిరసన
ఙ్ఞాపకాలు కొందరికి కొత్త ఊహలే

మామూలు రాత్రే
గోడలు పెరుగుతున్నాయి

కలలో రాత్రులు లేవు
తప్పిపోయిన జీవితం యెగుర్తూ

చల్లటి కలవరింతలు
మనసులో గాలి లేదు

వో ముఖం అవతల విసిరిన దేహం
వో సుఖం ఇవతల మురిసిన అహం

అదుపు తప్పిన పదాలతో వీగిపోతాం

పంజరంలో చేపలు

10072020