Blog Archive

Followers

Friday, January 15, 2021

[ ఒకప్పటి ముాలుగు ]

ఆకాశంలో సమాధి నీడ కింద, ఆమె నవ్వని నవ్వు వింటావ్. నివాళి పదాలు పేరుస్తావ్. ఎవరూ చూడని కొమ్మపై ఓ పాత చినుకు, ఓ పాత పిట్ట కనిపిస్తాయి నీకే. పువ్వులకోసం ఎదురుచూసే సుఖద్రోహమేదో చెట్టులో దాగుంటుంది. ధ్వని ఓ కాయం. చిల్లిగవ్వలేని నిద్రలో, కల. అదో నొప్పంతే. వేలిముద్రల నవ్వు. నొప్పి, కృష్ణహరితంగా. క్రూర శాంతీ! నీ ముఖం ఎంత బలహీనం. పిరికివాడి పిడికిలి రంగేంటి. మై వన్ అండ్ ఓన్లీ demoక్రసీ, దేశీక్రసీ, ఆ కలే లేదు, ఆకలే లేదు ఎవరికీ, నాలుకలే లేవు ఎవరికీ. అరలు అరలు ప్రతి అక్షరంలో. ఎవరివవి. వాటి పొదల పొరల్లో పారవశ్య ప్రార్థనల్ చేసేయ్. నల్లటి తాత్విక తాప తపస్సులు. మాండలిక కుండలినీ ఆటంకాలు. స్మార్ట్ ఆర్ట్ మురికి. మోక్ష విచారం.

అలిఖిత వైద్యం. నిశ్చల రూపాలన్నీ అవమానాలే. హార్టో పోర్టో పడవ తేలదు. జ్ఞాపకాలే, మింగు. ఆటల మాటలలో దిగబడి, ఏ బడిలో, ఏ ఏలుబడిలో మునుగుతావ్. గట్టిగా గుట్టుగా కన్నీటిని పిసుకు. నినాదాలే నిరూపాలవ్వాలి. మహాద్రోహీ! నోళ్ళు మూసుకునే అతిగా నిద్రపోతుంటాం. కలలకి పురిటినొప్పులు రానివ్వం. మా నోట్లోనే కలలుంటాయ్. నోరిప్పమ్. చావొచ్చినా. వెన్నెముకలేని ఆసుపత్రి ఎగురుతోంది. 

పారేసేవే ఎక్కువ, పదాల మధ్య ఉండే వాక్యంలో. వాటి కాటికాపరే ఏ కాలెండర్లోనూ చనిపోడు. ఎదలేని నీడ ఎదురవ్వదు. మరో చీడ పురుగు కొత్త లంగోటీతో. దైవత్వం, ఎవరి సంకలోనో నవ్వుతుంటుంది. నిరుక్త పరిమళాలు సంతోషద్వేషంలో.


Saturday, January 09, 2021

| ఖననం |

 గీతలతో ఓ బిందువు

వెఱ్ఱి నీడలు
ముసుగులేసుకునే
పాత మిణుగురులే
కొత్త చీకటిలో
చివరి అలపై

memory

 a plastic water

flows in vicarious truths

who will feel

the smell of a tear's carcass

~ పాత నాలుకే ~

 ప్రతి అక్షరంలో సొంత కురుపు

పీచు వాక్యాలు
కాయితపు విన్యాసాలు
స్వప్నాంతర ద్వారాలు
దవ్వ అక్షరాలే చేరాయి మాటలై
అనుభూతి అనుభవం
ఎవరి అనువాదాలో అక్షర చర్మంలో
పాత నాలుకే
పాత కన్నీరే

[[ a puppet's eye ]]

 a special silence

graze mutely
trending secrets of sun
secrete shadows
ny dear chameleon
unlove a beloved
beheaded tears grow healthily
crystals of space
fake deities flow
blind birds can also fly
limping lips
knows the taste of immorality
you can't sleep in words or in sounds
dreams will heal the language
torn fear of breath
is an astrological poison
just close these unaesthetic
unborn gates of silence

* నిద్ర ఎక్కడ *

 పదాల్లో ఏముందో

ఎవరికి తెలిసింది
వ్యాకరణవ్యంగవ్యాకులత
విలాసవిశేషవిషం
విడవలేనివినమ్రవికృతప్రేమ
నేత్రాలు
స్వప్నసుగంధాలు
ఎవరి వాసనో
అక్షరాల
అతిశయం
ఎవరి నరమో
తడిచిన వెలుగు ఏది
మిగిలిన నీడ ఎక్కడ
అసలు
మౌనం, అవమానం, శృంగారం
ఉన్నాయా
అసలు
నిద్ర
అసలు
కల
ఎక్కడ

** వొదిలి **

 నేలపై కొన్ని ఊపిరులు తిరిగాయి

కంటిపై కొన్ని కలలు మెరిసాయి
నీతో ఉండని జ్ఞాపకాలే
దయతో నాతో తోడుగా
దూరమవ్వని కన్నీళ్ళు
కనిపించే ఆకాశం
స్వచ్ఛమైన సంతోషం
నీతో తీసుకెల్లావ్
ప్రశ్నలే మిగిలాయి వడలి
జవాబులే పలకవు వొదిలి

* తీరం వృధా *

 ఒంటరినే

మహిమేదో
చెంతగా
అల్లాడే
మనసే మాటల్లో లేదు
ప్రయాణించని నేత్రం
స్వప్న ఛాయ
కాస్త పిచ్చితో మరో శ్వాసలో
కాలం వాకిలే లేక
పాషాణ ఆషాడం చిలిపి సిగ్గుతో
యెదలో నీటి పుట్టుమచ్చ
చేరే జీవితం, చూడలేను
విరిగే నీడే, హత్తుకోలేను
రంగుల్లో నిలవని నీడలు
పెదవుల పడవుల్లో తేలక
కనువిడిచిన తీరం
ప్రేమ తాకదు

-- చెప్పొద్దు --

 అట్లాస్లో లేని రోజుల్ని

మెడలోకి మెదడ్లోకి తొంగిచూస్తా అట్లా
వానపామునాలుకతో రుచిచూస్తా
వింత నిశ్శబ్ద స్పర్సకై
మాటలు మాటల్ని వెతుకుతుంటే
మనసును వంచిన వంచన రుచిచూస్తా
చీకటి రుచిలో
ఏ నీడ నవ్వదో తెలుసుకున్నాను
అందాల అబద్ధంతో
నీవెవరో ఎవ్వరికీ చెప్పొద్దు

----- కాస్త ఆగు ----

 అందుకని, అందాలన్నీ అందుకోనివని కంటికి కన్నీరు చెప్పదు.

కాలం కదా, ఇక్కడే ఉంటుంది, శరీర సంశయాలే అదేదో భాషలో.
పచ్చిపచ్చి నీడలు చేజారుతుంటే
పేరుకుపోతున్న నిజాలు, భయాలు.
ఎంత దుారం
ఈ దగ్గరి నిద్ర
అనగా అనగా అనే పాత ప్రేమ
గోడపై కన్నీరై
వినే పదాలపై రేపటి
చీకటి తిరుగుతోంది
ఓ నియంత నిరీక్షణ నీలో
తెరిచిన నిశ్శబ్దం మరోచోట అనాలుకతో
ఏ పలక పలకరింపులో అతెల్లగా.
ఎంత దండగ
ఆసక్తినివ్వని నీ మరణం

:: రెండు సంచులు ::

 అని, అనలేక

అనేక చుాపులేని మాటల గదులు
ఇందాక, ఇంకేదో
సంరంభం ముగించుకుంది గుడ్డులో
పరలోక కథలతో
చేరే వలకింద
ఆ అజీవులు జీవించే శోకం
షో... రసం సోలో... లో...
డప్పు కోటు వేసుకో... నీ కీర్తనా కీర్తితో
నువ్వే పాడగలవ్
నీ సొగసు దురద దుఃఖంలో
తడిమే తొడలేని
మౌనక్రిమి
నీరులేని ఆకాశంపై
నేలలేని మరణంపై నిదురించాలి
నేత్రం
ఓ చుాసే చావు
ఏ చుాపుాలేని నీడ

¿¿ ఎవరి నవ్వు ¿¿

 గది వరదలో కలలులేని కలలు

ఎగిరిపోతాయి ఈ పుాట
పదాలు నీటిలో మునుగుతుంటుంటే
ఎవరు కదిపారో
ఏ నీడాలేని నీడని
నీటమునిగిన చీకటిలో
వడలిపొతున్న గాలి
ఖాళీ గోడలు
ఎవరి నవ్వు అక్కడ
అత్యంత ప్రేమతో
ఓ విపత్కర ఆనందాశ్రయం
రేపటికి ఉండకుాడదు
చుాడు
ఎప్పటి ఆఖరి ఒంటరితనమో

:: విను అనే చెవి ::

 ఏ ఎక్కడ చనిపోయానో

ఇవ్వని
అవలేనివి ఎన్నో
పెదాలు పిట్టలు కాలేవని
ఎగరలేనివని నీటికీ తెలుసు
ప్రేమలో ఉండే నిశ్శబ్దం
పదాలకే ఎప్పటికీ చెప్పకు
క్షమించే మరణం
ఓ కన్నీటి నీడపైనే

° చలి చినుకు °

 ఏ చీకటో

చీకటే ఎదురైతే మనస్ఫూర్తిగా చుాడలేను
ఆట
కలలో
రేపటి నిద్ర లేదు
తెంచుకున్న
అక్షరమే గురకపెడుతుంది
పగలు ఎవరికో
పవిత్ర నిశ్శబ్దం ఏ అంధకారంలోనో
దారిలేని
నవ్వు చితిపై నవ్వుతోంది కిరాతకంగా
చలి చినుకు మనసులో

៛ వరమివ్వు ៛

 కన్నీరే నిలవని కంటితో

నిన్ను చూస్తే నన్ను క్షమించు
నీరే నిలవని అలనై
నీతో మాట్ల్లాడితే నన్ను మన్నించు
అడుగుజాడలులేని నా ప్రేమ
నీతో ద్వేషిస్తే నన్ను మందలించు
నిన్ను తాకే స్వర్గప్రేమ
నాకు ప్రసాదించు

| గాలినీడ ప్రేమలోనే |

 ఇంకా, ఇక చుాసేదంతా

అసంఖ్యాక నిష్క్రమణ అశాంతి శాంతే.
ప్రవక్తల సంచుల్లో చీకటి
యెవరికైనా కనిపించినా,
వారికి అయిపోయిన చీకటే మిగులుతుంది.
చెరుపుకున్న దేహంతో
సత్యాల్ని , అసత్యాల్ని గ్రహించలేను.
ఓ పదాన్ని సాగదీయాలి
ఇక్కడ ఏమీ లేనట్టు
సుదుార ఆకారమేదో
అసాక్షిగా
తలుపులులేని నీడలో
ఇంటికే ఎపుడు చేరుతానో

- పువ్వు -

కనులు లేనోడినే

బొమ్మలు కనిపిస్తాయి భాషలో
ఓ అభాషలోకి రంగులంత
చిత్రించే సువాసన హత్తుకోదు
తడుతుండే చీకటి తలుపు
చూసే గాజు గాలై
కన్నీరు ఎగబాకుతోంది నాపై
నాలో రేపటిని విందామనే
నాలో
తప్పిపోయే నీడనే కదా
చూసే చూపులే లేనోన్ని
చేతులెత్తేయ్ నీరులేని నీటిలో
తారీఖులు రాని ప్రేమలో
ఖాళీ గోడలే
ఖాళీ రంగులే నాలో నాతో

బుడగ - గాలి

ఆతృత. అర్థం దొరకదు. 
ఎగిరేవే. పగలవు. మిగులు 
స్పర్శ. తిరుగు. 
కరుగు చూపులో పరీక్ష. 
అక్షరాల తరుగు. కల కంకులు.
తల వంవులు. ఎవరికో. 
అదృశ్య ఆతృత. చవిచుాడం. 
చదివే ఙ్ఞాపకాలు వొద్దు. 
బహుకరించే పదాల్లోని 
ఆకృతి పదాలేదే కాదు.
ఎవరి పదాలో. కొట్టుకుపోతున్నాయి.