Blog Archive

Followers

Wednesday, December 05, 2012

నవ్వే నాలుక

స్థనంలో శ్మశానం 

ఏదీ సరిగ్గా లేదు 

ఓ వెలుగు నీటిలో 
బందీ ఘటనలు 

తిరిగి తిప్పలేని అనుభవాలు 

ముక్కులోంచి మూత్రం
మోక్షంలోంచి మోహం 

చీదర చీదర చింతల చలి 

ఆకార అనుమానాలే
ఆక్రందనాస్మృతులు  

ప్రశ్న మరణదేహంతోనా 
అప్రశ్న మరణంతోనా 

అదృశ్య అధీనంలో

ఆ కిటికీ లేదు 
పూల కిరీటాల గాలీ లేదు 

మరపునిచ్చే ఆకార  అక్షరాలూ లేక
ఏ యంత్ర యాత్ర యోనిలోనో తపస్సులోనో నువ్వుంటావ్

అదృశ్య అధీనంలో ఆధార అశ్రువై
మూగ ముఖంతో కనిస్పిస్తావంతే 

ఇరుకిరుకు ఇంద్రియాల ఇంద్రజాలం 
ఓ విన్యాస విధ్వంసం 

మరో ఇమడని పగటిలో 
పొలమారిన ఊహలు 

ఎవరూ ఉండని అద్దంలో 
ఎవర్ని వెతుకుతావ్ 

చీకటి చేతుల్తోనే తెరవాలి 
కిటికీనైనా, గాలినైనా 

Tuesday, November 20, 2012

ఊపిరాడిస్తూ







నిన్నటి గ్రహణం రేపూ కొనసాగుతుంది అలల కళ్లపై కలల పసుపుతో తోమిన తెల్లటి తిలకం దిద్దుకుని ఏ అరచేతులపైనో నీడలై కొమ్మలై రోజూ పలకరించాలని పలకపై దారంతో అక్షరాల్ని కట్టేస్తావు కొంత కాలాన్ని కన్నార్పకుండా కన్నీళ్ళతో అదేదో ఘటన మరో చిహ్నంతో కొత్త తేడా మనలోకి వచ్చినా రానట్టే అమాంతం చుట్టుముట్టినా చెరిపేస్తాం ఒకే ముడిని మనిద్దరం బిగిస్తాం బిగుతుగా బిగ్గరగా వినపడదు అది ఊడుతున్నప్పుడు ప్రశ్నలే అప్రశ్నలే సంజాయి కెంజాయి ఎంజాయి గంజాయి గుంజాయి మెడ నరాలు తొడ రక్తాలు పగిలిన బుడ్లో బిడ్డలో బొడ్లో ఎప్పటికీ దాచుకోక కోకనీ లంగోటినీ కృష్ణార్పణం గంగార్పణం ఏ దప్పనమూ దూరని దర్పణంలో వొదిలేస్తాం ఊక ఊక నల్లటి ఉక్క చిమ్నీలో ఉగ్గిన్నిలో ఖర్చుపెట్టని పెదాల్లో దేహాతీత తీట ద్వేషం కళ్ళని కన్నీళ్ళల్లో దోపి అలా చూస్తూ చూస్తో ఉంటున్నామా ఊపిరాడిస్తూ...

Wednesday, November 14, 2012

నీటి తలుపులు

ఈ వెలుగుని రంగులతో నింపి వెళ్ళిపోయినా
చీకటిని నింపటానికి ఏ రంగులు కావాలి

దృష్టి దేహంతో
సృష్టి పరవశంతో
నీ చీకటికి నా చీకటికి యెంత తేడా

యిరువురమే
ఆకుపచ్చటి కాళ్ళతో
ఒంటరి నేత్ర స్వప్నాల్లో

తలుపులు తెరిచే
నీటి తలుపులు

నోటితో కొన్ని మాటల్ని తెరుస్తాం
మూసేస్తాం కల నోటిలోకి

యిరువరమే
చీకటిలోకి చీకటి కదలటం కలవరిస్తున్నాం

Tuesday, November 13, 2012

పిల్లి మూత్రం

~ ~ వీధి కుక్కలు నా కళ్ళు
~ ~ నీటి పుట్టలు నా చూపులు
~ ~ నీ చూపులు మాత్రం పిల్లి మూత్రం వాసనతో


~ మరణవస్త్రాలు నా మాటలు
~ దహనరుణాలు నా వాక్యాలు

~ నీ పదాలే దోమల నవ్వులు

Tuesday, November 06, 2012

పొలికేక

సరిపోలేదు
పోలికలేని లోతు తెలిసి

లోటు లోటు ఏదీ సరిపోక
సరిపడా సరదా పరదా పాములు
కాటేయకనే కావలింతంతా

కలకనాలి ఎలుకతోకల్ని విసిరేస్తూ
ఎంగిలిపడాలి చీమతోకల్ని జారవిడుస్తూ

అంతరించే ఆలోచనల చీకటి చివర్లని చీకాలి
ఏదో ఒక రతి
ఏదో ఒక షాపింగ్ షాడో
సోడా కొట్టు

బరువైన గ్రహణాలు
నేత్రాలు, అక్షరాలు, స్ఖలనాలు

డబ్బులున్నాయా
పోలికలేని పొలికేక
మలికేక

Thursday, November 01, 2012

నల్లటి నవ్వు

అంతరంగంలో
అదో సంయుక్త సశేష సంభాషణ

జ్ఞాపకాలన్నీ అహృదయంలో 
ప్రతి హైరానా హాయేమో

గాలి గదిలో
unlearn the love

ఓ పురాతన వాక్య దోషం
మరణం

దృశ్య ద్రవాలు
అంతులేని నిశ్చల శబ్దాలు

నాలుకపై నాలుకలు
ఖాళీ జిహ్వలు

అలల చీకటిలో
బతికేసే అనురాగాలు

నల్లటి మూత్రం
కన్నీటి చివర నలుపు

నల్లటి ద్రోహం 
నల్లటి నవ్వు నవ్వవూ

Tuesday, October 30, 2012

అద్దాల మ్యూజియంలో

సమాధిని అక్షరాలతో నింపకు
మరణం ఊపిరి పీల్చుకోవాలి

లేత గడ్డిమొలక
సూర్యుడ్ని, జాబిలి దాటే ఆకాశాన్ని వీక్షించాలి

రంగుల్లేని చెట్లు
రంగు రంగుల వర్షంలో మాట్లాడుతున్నాయి

అసంతృప్తి
అద్దాల మ్యూజియంలో  



ఒంటరి నీడ
రాత్రి

భగవంతుని స్వప్నం

సమాధిపై గాలి
కళ్ళు తెరుస్తోంది

Sunday, October 28, 2012

పిల్ల చేపల కలల కడలి

మాయా
నాగరికత అంతం
క్యాలెండర్ కాండ్రించింది

ప్రేమ పేజీ తిప్పేసింది
ప్రేయసి మరో రోదసి

కానుక అనుకున్న జీవితం
గానుగ

మన్నిక  కావాలి
                    మచ్చిక  కావాలి
లేదా
మనలేం
               మానలేం
                           
#

ఆపాలనుకున్న ఏదీ కాదు అంతం
ఆగటం అగత్యం
గతం అనంతం
ఆకర్షించే అహం స్పృహ
ఆహ్వానించదనేకదా
ఇంత బాధా!

#

కొండ చివరన
పాదం కొన మోపినప్పుడు
కాసిన
నీ వొక్కడిదీ
వొంటరి కాదు చూపు
నీ పాదం ఇంకా కానని
లోయ
          వైశాలి
 

కనుగొన్నదేదీ కన్నుదే కాదు
చూపు విస్తరి

#

దృశ్య దేహాలు మరుగున పడనీ
దేహాతీత దృగ్విషయాలే
మక్కువ వలయాలు
దరహాస హోమం ముందు
మృదుమాస గాయం
 

సోయ హొయలు అనిర్జీవమ్
ఎక్కడిదయినా సరే
ఓ రాత్రిని ఈ రాతిరికి
కొన్ని కలల సేదకు
అక్కున కునారిల్లనీయ్

#

బరువు జీవితం
అరువు కాగితం
సిరా కరిగే కడలి
వీపున శిలువే తీరం
మనో ఏకాంతరం నడుమ
మరో ద్వీపాంతర
                        వాసాలు
దిక్కు దీపం ఆర్పినా
దరి దారి కాలిని కననీయ్

#

స్నేక్స్ సాక్స్ విడిచినా
విషం సశేషం
తేలియాడే ఆడ ఆట
                            అవాక్యం

అమాటలేగా మిగిలేవీ
అకలలేగా మసిలేదీ

కని
      కరించని సత్యాలనే
కఠోరంగా అను
                   సరించాలి

#

ఆ పిర్ర నునుపు వంకరే
ఆ పిట్ట మనసు ముక్కెరే

ఎరిగే
ఎగిరే నిశ్శబ్ద దహన కాంక్షా వృత్తాల్లో

ఇటు విరిగి ఒరిగాం అంతే

అతి ప్రాతః మృత్యు కారాగారంలో
సరికొత్త ప్రాణ వాయువు

శ్లోకించు
స్తోత్రిం
చు
నును దేహ రశ్మి రజనును
 

వెనుతిరగడం నిషేధం

అద్దంలో నిరాకరించబడిన
వెన్ను దన్నుఆమేనా?

చూపెప్పుడూ
ఆరని నెత్తుటి దస్తూరీ

#

అధరం మాటున అచిత్రం
దేహ భాష వంచన ముఖచిత్రం
చేరాల్సిన రాల్చిన పగల్చిన
అద్దాల్లో
అదాహ ఆకృతి

పిల్లల పిలుపెక్కడ?
పిలుపులోని పిల్లలెక్కడ?

తోడు దిగులుగా
నీడ మిగులుగా
ఈ రాత్రి
             ఈ చెట్టు
                             గర్భవతి

పిల్లలే
ఏ అనుమతీ అక్కర్లేని
రెక్కలల్లార్చిన పిట్టలు

#

తిరగుతున్ననేలపైన
వాలలేని వానలే ఆనవాలై
దేహాలు ఆరబెట్టుకుంటున్న మేఘాలు
చడీ చప్పుడూ లేని
మౌనాలోచనాలు
ఎప్పటికప్పుడు
తలతిప్పేసుకునే
రక్త పాతరలు

#

వృక్ష వక్షోజాలపైనా
కుదురు ఎరుక రాకపోతే
చుట్టూ కల తిరుగు కనీసం
ఏదో మొక్కు వున్నట్టు
ముక్కలు ముక్కలుగా
మొక్కలు మొక్కలుగా
పగిలి విత్తులా
 

నిప్పుకు పుట్టిల్లే
విత్తు వళ్ళు
             కను

#

మరో వాలు తిరిగిన ఆకాశాన్ని
మరో చినుకు అడిగింది పాదముద్ర

దరి చేరే గాలి కలలో
సకాలం ఎవరిది?
విసర్జించని అక్షరాల్లో
మౌనం ఎవరిది?

మరో గాలం
జాలరి జీవితం
జారే వలే
చేప కలల కడలి

------------------
 

అనంతు
ఎం. ఎస్. నాయుడు అక్టోబర్ ఇరవై రెండు. పన్నెండు

Saturday, October 20, 2012

నాయుడు అసాంఘికుడా? *

ఒక కవితా సంకలనానికి ఇంత కంగాళీ శీర్షికని కవీ ఇంతవరకు పెట్టినట్లు లేదు. షెల్లీ కవిత 'The Triumph Of Life' ని విశ్లీషిస్తూ Jacques Derrida 'Living On' అనే వ్యాసంలో ఒక ప్రశ్న వేసాడు. "How then is the title of the book to be read? First, is it readable?" అలాగే 'death sentence' అనే పదబంధాన్ని కూడా చాలా దీర్ఘంగా విశ్లేషించాడు. మరణశిక్ష అనే మాటని మృత్యువు అనే ఒక బహుమతి అనికూడా అర్థం చేసుకోవచ్చన్నాడు (arret de mort). విజయం షెల్లీ జీవితపు విజయమా? మృత్యువు మీదా? జీవితం మీదనేనా? ఎవరి జీవితం? జీవితం అంటే ఏమిటసలు? ప్రశ్నలన్నీ వంద పేజీల బృహదావ్యాసంలో చర్చించాడు. అదంతా ఫ్రెంచ్ గోల.

ఇక వెళ్ళిపోతాను అంటే పేచీ లేదు. ఒక వెళ్ళిపోవటం ఏమిటసలు? ఒకడు ఒకానొక వెళ్లిపోవటమా? లేచిపోవటంలానా? ఒక రాక, ఒక పోక? కొన్ని శబ్దాలు కొందరు కవుల్ని ఏరుకుంటాయ్. You are he who writes and is written అని ఒకడంటాడు. మరొకడు (పాఠకుడన్నమాట) 'little by little the book will finish me'(Edmond Jabes). అందరూ హాయిగా హైకూలు రాసుకుంటుంటే నాయుడోచ్చి ఎక్సెండెంట్ కవిత్వం రాస్తూ, చెరిపేస్తూ, చింపేస్తూ, తగలబెడుతూ, పారేసుకుంటూ, తన కవితల్ని తానే ఇతరుల దగ్గర్నుంచి దొంగిలిస్తూ, రహస్యం పారేస్తో మళ్లీ నాలుగేళ్లకిలా వొచ్చాడు ఒక వెళ్లిపోతానంటూ.

సరిగ్గా 7.9.1997 నాయుడు అచ్చుకి సిద్ధం చేసి నాకు 'ఇపుడే' అనే కవితా సంకలనాన్ని ముందుమాట కోసం పంపిస్తే  47 కవితలకు ' 47డుపులు' అని రాసి పంపాను. దాని ప్రతి నా దగ్గర ఉంచుకొని. 47 కవితలు ఏమయినాయో ఇప్పటికీ ఒక రహస్యమే.

' ఒక వెళ్ళిపోతాను' లో మొదటి కవిత పేరు - 'చివర్నుంచి'. భాషాగత , భాషాంతర్గత శూన్యవాదం కవిత నిండా. అన్ని కవితల్లోనూ ఒక అంతఃసూత్రం కన్పిస్తుంది. అది నిబద్ధత కాని ఒకానొక అసంభవిత స్వబద్ధత. "A systematic undoing of understanding"( పాల్ డి మాన్) చివరకు పాఠకుడికి మిగిలేదేల్లా, 'నోరు మెదపకుండా మనలో మనం మాట్లాడుకోవటం'(నాయుడు)

భాషని అనన్వయత్వంతో రాస్తాడు ఈ కవి. ఎలా అంటే 'గడియారం వీపులో / పొగాకు వాసన'. 'ఒక లోనికి వెళ్
ళే తిరుగుతున్న / అస్పర్శ'. 'వెయ్యి స్పర్శల కన్నీళ్లు'. 'నా లోపల / చనిపోయాను'. 'అన్నీ గుర్తే / అయినా సగం మర్చిపోయినట్టు గుర్తుంటాయి'. 'పదం కింద చెదలు పట్టి'/ ఈ అనన్వయ భాషనే ఫాలిటిక్ ఫాలసి అంటారు కదా.
ఆక్సీమొరాన్ కూడ ఈ కవి శిల్ప రహస్యాలలో ఒకటి. అసత్యమైన సత్యం, అసత్యమే సత్యంలా - 'నాలుక లోపల / మరో నాలుక / సముద్రం / నీటిని మింగుతోంది.' 'మృత్యు ముఖం నా ముఖం / లోపల.'
ఇతని సినక్ డొక్ ఇలా ఉంటుంది. 'అద్దం కాలుతుంటే కొన్ని అక్షరాలు పోగై / పొగై అద్దం చుట్టూ తిరిగి నవ్వు కుంటాయి/'
Transferred epithet ని  ఇలా వాడుకుంటాడు. "రైలు పట్టాల్లో గుండె నొప్పి, ఉబ్బసం, పచ్చ కామెర్లు / పక్షపాతం నాలుకతో తమలపాకు నవ్వులతో ఎక్కడికో' / 'పట్టుకున్నాను పసుపు కొమ్ముల గాజుల్ని', 'కన్నీళ్లు ఆవలిస్తున్నాయి" దీన్ని ఇమేజిజంగా వెంటనే గుర్తుపట్టుకోవచ్చు. ఇమేజెస్ని విడవడు నాయుడు - 'కలొకటి / ఏడుస్తుంటే ...' 'వణుకుతో గుండె గాలి'/ 'నా దేహం లోపలికి / మరొక నా దేహం వెళ్ళింది.' 'నువ్వు / నేను / ఒక్క కన్నుతోనే ఏడుద్దామా.' ' ఈ రోజు కూడా ఆకాశం వొచ్చింది'/ 'ఎవరూ మిగల్లేదు నా కల చెవిముందు.'
కొన్ని metaphysical conceits - అసలు బండంతా వీటితోనే నెట్టుకొస్తాడులా ఉంది నాయుడు... 'మరణం వినిపించటం లేదు'/ 'ఈ చీకట్లోంచి ఎప్పటికైనా తప్పిపోవాలి.''సుడిగుండాల లోని నది మాయం/ గడియారంలోని కాలం మాయ'.'ఎవరివో రెండు పెదాలు విరిగి పడుంటే / నా కన్నుని విప్పి దాచేసాను.'
నాయుడి కవితల్లో anthropocentric విరగబాటు తిరగబాటు, ఆఫ్రికన్ తాంత్రిక క్యూబిజమూ స్పష్టంగా కన్పిస్తాయి. ఎపుడంటే - 'వీపుకి వక్షోజాలు / కొత్త దేవుడు.'
'అతడి యోనినీ ఆమె శిశ్నాన్నీ తాకి / వొచ్చి వెళ్తూనో వెళ్తూ వోస్తూనో ఉన్నాం'. 'పేగు చుట్టూ ముగ్గులు పెడుతున్న కన్నీళ్లు / ఒక వరస కలపలేని చుక్కలు.'
పూర్వం ఎపుడో అన్నాడీ కవే - 'పాడై పోయిన వాక్యంలోని / ఫుల్ స్టాప్ ని బాగుచేస్తున్నాను ' అని. అందుకే మళ్లీ ఈనాడు ఒక పేజీ నిండా విరామ చిహ్నాల్లేని 'గాలి యోని మృదు మృత్యువు' అనే కవిత (పారాగ్రాఫ్ కవిత) ప్రచురించాడు. అసలీ శీర్షికకు అర్థం ఏమిటంటారా? నార్సిజం అంటే ఏమిటో అదే ఈ కవితకు అర్థం.
నాయుడు అసాంఘికుడా? నాయుడి కవిత్వం అసాంఘికమా?
వాయొరిజమా? గడ్డకట్టిన స్వీయ కరుణా? పూర్వమెపుడో అన్నాడతనే - 'నిశ్చలంగా నిర్మలంగా / లంగా ఎత్తుకుంటాను ఆకాశం వరకు'/ అని.  ఈనాడు అంటున్నాడూ, 'మృత్యువుకీ, మూత్రశాలలకీ వాస్తు ఉంటుంది'/ స్త్రీ పురుషుల మూత్రాంగాలకి వాస్తు ఎక్కడుంది / ప్రతి మూత్రానికీ, మృత్యువుకీ / దూరం అవ్వటమూ ఓ జీవితమే.' 'పసినవ్వు ముందు / మోకరిల్లి ఉన్నాను / నన్నిక్కడ్నించి లాక్కెళ్ళవద్దు' అన్న కవి అసాంఘికుడా?

కవిత్వంలో కలాజ్ శిల్పాన్ని ఇలా చూపిస్తున్నాడు 'కళ్ళు / స్త్రీ పురుషుల జననాంగాలు ముఖంపైన.' 'ఎత్తుపళ్ళ సముద్రం' / 'గోడకానుకున్న నీడలు'/

తాంత్రిక వాస్తవికత నాయుడి కవిత్వంలోని మరొక అంశం. 'నా దేహం లోపలున్న ఎముకలన్నిటిమీదా పూలు ఉంచాను.' 'ఆమె గర్భిణీ గొంతుతో / 'గదిలోనికి వెళ్ళండి / అశ్రువుల్ని నింపుకోండి / కానీ, ఏడవకండి బలహీనతల్లోంచి'. 'ఈ రాత్రిని / గోడకి తగిలించాను / రేపు బైట పారేస్తాను.'

'అస్పర్శం' అనే ఒక పూర్తి పుట కవిత చదవండి. లైంగికత కవిత్వంలోని ఒక ప్రధానాంశంగా గుర్తించండి.

అదొక kabbalistic magical absolute. ఈ absoluteని తట్టుకోగల ధైర్యం ఉంటే నాయుడి పుస్తకాన్ని తెరవండి

ఇప్పట్లో ఆ ధైర్యం లేకపోతే పోయిందిగాని ముందీ పుస్తకాన్ని కొనుక్కుని దాచేయండి. లేదా నాయుడు మళ్ళీ ఏ కోపంతోనో ఆ అచ్చు ప్రతుల్నీ తగలేట్టేస్తాడేమో.

ఎం. ఎస్. నాయుడు ఒక విశిష్ట కవిగా గుర్తుపొందుతాడా లేదా అనేది మన సోషల్ సైకాలజీ ఆఫ్ రీడింగ్ మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అకవులనే మనం కీర్తిస్తూ కూచుందాం లెమ్మంటే ఏ గొడవా లేదు చివరికి. 

------

*ఒక వెళ్ళి పోతాను - సంకలనానికి, వార్త 2-10-2001లో 'మో' గారు  రాసిన సమీక్ష ఇది. 

Monday, October 01, 2012

వెలుతురు సంకెళ్ళు

ఎన్నో సంకేతాలు కావాలి నిశ్శబ్దానికి
మరెన్నో నిశ్శబ్దాల్లోంచి ఓ మౌనం

ఆ తర్వాతే ఒక అలిఖిత భాష నీకై

నిస్సంకేతం ఈ దేహం
స్వల్ప తాత్పర్యాలతో తడుముకునే స్పర్శలు

నిరసనొక
అసంపూర్ణ వ్యామోహం

అసలీ దుఃఖస్పర్శలు ఎవరికోసం
ఓ తిరస్కృత విమోచనే ప్రతి సంభాషణ

అవాక్య మరణం  ఏ సమాధాన లీలో
ఖాళీ కనుపాపలు ఈ వెలుతురు సంకెళ్ళు

Wednesday, August 22, 2012

ఖాళీ దీపాలు

గదిలో దీపాలు ఆర్పేసాక
దేహాలలో దీపాలు వెలిగించక
మౌనదీపాల్ని వొడుకుతుంటాను

రోడ్లపై దొర్లిన నాలుకల్ని మోసుకొస్తాను
లెక్కలేనన్ని అక్షరాల చిక్కుముడుల్ని సరిచేయాలని

ఖాళీ దీపాలు ఈ నాలుకలు

Friday, August 03, 2012

వేధించే అజ్ఞాపకాలు

జ్ఞాపకాల               శిధిలాలకింద                ఇంకా             ఇరుక్కునే


పూలు                  నక్షత్రాలు                     పంపే              గాలితో


నీడల్ని                 చూస్తున్నాయి               నీడలు








జ్ఞాపకాలు              ఈ                           లోకానివి                              కావు


చరించాలి                                           రతిసమాధులపై       
             
రాతి                                                 దిక్కుల్లో






నీటిపై                                               నానిన                                నీడలు  


అద్దమొక                                           నానిన                            ఆటబొమ్మ


దా                                                   దా                                  బొమ్మలు


బొమ్మలు                                           నీడల                        నీటి బొమ్మలు

Sunday, July 29, 2012

స్థలంకై స్తనంకై

స్వప్న సర్కస్లో
పైకీ కిందకే కాదు
లోపలికీ బైటకే కాదు
ఎటూ ఏదీ కానీ స్థలంకై స్తనంకై సమాధికై

సూర్యనాడి చంద్రనాడి
ఏనాడో ఓనాడు ద్యోవీధిలో

మాటి మాటికీ
మాట మాటకీ
ముఖవచనమే

విరజలో మునిగి
అద్దాల్ని వదిలి
వీడ్కోలు చెప్పాలి మనస్కారముతో

ఒకోసారి పాదాలు వక్షోజాలే
పదాలే ఎగరని ఎండిన ఆకులు

నిద్రలోకో దిగంతంలోకో
నన్నేను విసిరేసుకుంటాను

ఇంకా పడిపోలేదు
నా కళ్లపై

Thursday, July 26, 2012

చీకటి ఊపిరి

అంత పరిచయం లేదు కానీ
ప్రేమే మళ్లీ మళ్లీ మాట్లాడని సముద్రమై

పదాల్ని దేహాన్నీ

దాచుకోవటం ఏ నీటికి ఎప్పటికి తెలుస్తుంది

చిన్న చిన్న సువాసనలు

మరణంతో మరణానికై తేలుతూ

ఏ బాధాలేని రంగుతో

అలల వీధుల్లోకి

మళ్లీ మళ్లీ అంతా పరిచయమే

చీకటి ఊపిరి

Friday, July 20, 2012

పట్టుకోకు


అసంపూర్ణ పదాల్తో
అనుభవాల్ని అనుభవించేది మరెవరో

శబ్ధించే ఆలోచనల్తోనే వివరణ వర్ణాలు
అపాయ శాంతికై శోధనాకృతులు

ఇష్టంతో సంసిద్ధమైతేనే అయిష్టత రూపం
ఏ అయిష్టతైనా ఓ స్థిరాలోచనే

ద్వితీయానుభవాలే సంపూర్ణ
తిరోగమన ప్రశ్నలు

పదాల్తోనే అజ్ఞాపకాల మైమరుపుల మోహరింపులు
ప్రతి అక్షరం మరో వృక్ష విభజనే

ఏ చిత్ర నిశ్శబ్దమో
బులుగు కేకలతో ఎగుర్తోంది

Thursday, July 12, 2012

దాటిపోతోంది

చెట్లు తిరుగుతున్న ఆకాశాన్ని వొదిలి రావాలి
తెలియని గాలి పేగుల్లోకి కొట్టుకుపోవాలి

ఏ రాత్రినో కొంచెం నమిలి

నన్ను కొంచెం నములుకుని

కిటికీలోకి

మరణం తొంగిచూసింది

ఏ అడ్డమో అద్దం లోపల

చేతులడ్డం పెట్టకు

చీమలతో మాట్లాడి

నిన్నటిని వెతకాలి

కలలో ఖాళీ గోడలు పెరుగుతున్నాయి 

ఖాళీ చెట్లు గోడల్ని నరుకుతున్నాయి

గాలిలోకి బైల్దేరే నిశ్శబ్దం

నన్ను దాటిపోతోంది

Monday, July 09, 2012

దారేది

చినుకులు రంగుల్ని వెతికాయి
పూల మధ్య పడుతుంటే

రంగుల్లేని చినుకులకై

పూల నిరీక్షణ 


నీరీక్షణ రంగులోకి

దారి ఏది 


ఎవరు చూపెడతారు



Thursday, March 15, 2012

ఉడుము

కన్ను జారింది
వాక్య సంయోగం జారింది
దేహముక్తి జారింది
స్వప్నమృత్యువు జారింది
జ్ఞాపకం జారింది
జరుగుబాటు జారింది
జడిసింది జారింది
జరగబోయేదీ జారింది
జ్ఞానమూ జారింది
మంత్రమూ జారింది
మూత్రమూ జారింది
జరిగేవన్నీ జారాయి
చేజారేవన్నీ జారాయి
చేజేతులా జారాల్సినవి ఇంకెన్నో
గీయని బొమ్మా జారింది
పెదవులు జారాయి
చరిత్ర జారింది
అద్దం జారింది
జననం జారింది
జననాంగాలు జారాయి
జారు...
జారు...
అక్షరాల్లోకి జారు.

Monday, March 12, 2012

నీ నువ్వు

గట్టి కౌగలింతకై గాలి నీలోకి
నీ నువ్వు లోపలిలోకి


నువ్వెక్కడో లోతు లోటులేని
రక్తం దాగిన మెత్తటి చీకటి ముళ్లపై


ఆత్మజ్ఞాపకంలో దేహం ఉంటుందా
ఆత్మజననం దేహానికీ తెలుస్తుందా


అద్దాల్లో సంతానాలు
అద్దాలతో సంతాపాలు


శాశ్వత మరణఛాయ
అశ్రువులే మనసు విరామచిహ్నాలు


విషాద కృతజ్ఞతతో ప్రతి ముఖం

Wednesday, February 15, 2012

కాకి కాన్పు

...కాకపొతే కాకికీ కానుపు వొచ్చి కంపు వొచ్చి కవ్వింత కవితంత తెలిసి మరో పువ్వు మరో పువ్వు మీద తన తెల్లని రెక్కలతో పొడిచింది పొగిడింది పాడింది పొర్లింది పొందింది ఏదో ఏ కాకికీ కాస్తంతైనా కోయ్ కోయ్ కోయ్ యకు అని మాత్రమే నియంత్రించింది నీత్రించింది మూత్రించింది మూడుపూటలా మూడులోకల్లో కాకి పిర్రల్ని ఎగరేస్తూ పోగేస్తూ పారేస్తూ నాలుక పూసిన పూలు పూసిన మానమౌనం పూసిన శాశ్వత క్షణిక యాత్రలో ఓ ఈక కంట్లో ఎర్రటి దురద నవ్వు వాలి నల్లటి తృప్తితో తెల్లటి అసంతృప్తితో .....

ఎలుక

కల నుంచి నిద్రలోకి 
యెడబాటు నుంచి బెడదలోకి
మరణం నుంచి జననంలోకి 
ఎన్నో చీకటి యుద్దాల్ని దాటి వస్తాను 
ఎంగిలిమెతుకుల్ని తింటూ 

గుడ్లగూబ చెట్లు 
పాము నీటి గడ్డివాములు 
సీతాకోకచేపలు 
పీత చీమలు 
పిల్లి పులకరితలు 
బెల్లం బాలింతలు
సున్నం రాబందులు 
అన్నం పసికందుల్ని 
దాటి దాటి దాటి వస్తాను 
ఎంగిలి అంగిలి తెరుస్తూ 

దారీతెన్నూ లేనోడి రాత్రినుంచి 
రంగులరాట్నం తిప్పుతూ తోకూపుతూ
నిద్రనుంచి నిద్రలోకి 

Saturday, February 04, 2012

మాటల సమాధి

మాటల్ని విచక్షణారహితంగా 
నా ముందు చింపి పోగేస్తున్నా 
వాటి ఆలోచల్ని చింపే మాటలు ఎక్కడ 

దాగిన తెరలు 
దాచిన తెరలు 
మాటల తెరల్ని ఎవరు తెరుస్తారు 

చంద్రుడు రాత్రిని వెతుకుతూ 
రాత్రి పగటిని అనుసరిస్తూ 
పగలు చంద్రుడి అడుగుల్లో 



ప్రేమలేమి గురించి ఆకాశం 
నీతో ఎప్పటికీ చెప్పదు

అపరచిత ఆత్మీయ 
మాటల సమాధి 

నానబెట్టిన పదాలు 
కళ్ళు

Friday, February 03, 2012

నిశ్చల గాయాలు

రోగగ్రస్త నేత్రాలతో 
ఎన్నో ఆనందాలు 

తృప్తి లేదు 
చనిపోయే గడియారం ఎవర్ని చూస్తుందో 

శూన్య సూర్యజ్ఞాపకాలు 
నిశ్చల గాయాలు 

వృద్ధ భవిష్యత్తులో 
ప్రార్ధించే చేతుల్ని అందచేయి

కాకి కూతురు

వృత్తి 
నివృత్తి లేనోడ్ని ఈ కాస్తంత బతుకు భజనలో 

క్షణమాగు 
ఇతరమైన హితమైన వైరాగి వాక్యద్రోహం వేలాడుతూ 

వ్యపదేశాలు లభించు వ్యాకరణ వ్యాకృతికై 
వ్యావృత స్వేచ్చా చీలికల్లో 

అకర్మకక్రియ కర్మ అపరాధాలు 
అపరక్రియల అపరలోకాలు ఎవరు చూసొచ్చారులే 

మృగ సుభాషితాలు 
సుకృత వీరులవే 

ఆత్మ భ్రమణాలు
జిహ్వ పరోభ్రమణాలు ఇంకెంత కాలంలే 

శ్వేత శబ్దాల్లో 
బధిర బుద్ధి 

కాకి కూతురిని గుర్తుపట్టగలవా

Wednesday, February 01, 2012

బోర్లా జీవితంలో

అటు ఏదో ఉందనుకున్ననా
ఇటు ఏదీ లేదనుకున్నానా 
ఇవేవీ కాదని ఏమిటేమిటో అనుకుంటున్నానా 

పూర్తిగా ఇది అవ్వదు అని తెలుసునా
అది పూరించని పూరించిన ఖాళీ వాక్యమేనని 

మరి అప్పటికీ 
అప్పటికే నవ్వినా ఏడ్చినా మిగలలేని ఖాళీ అక్షరాలూ ఎక్కడుంటాయి 

చేతులులేని  అద్దాల్లోనా
అద్దాల్లో విరిగిన ముఖాల్లోనా 

 బోడి ముడులో
బొడ్డు ముడులో 
 బోర్లా జీవితంలో 
 కొన్ని అగ్ని నాశనాలు 

చివరే లేక 
ఇక ఏవీ లేనేలేని  ఓ బొట్టు ఖాళీ వర్తమానం తప్ప

Monday, January 23, 2012

లోలోపల

ఒక సూది మనిద్దరిని
దేహభాష బంధాలతో కలిపి కుడుతోంది

బిలిబిలి నొప్పి అదృశ్యమైంది
పదాల నిశ్చేతనమే లోలోపల

నవ్విన కన్నీళ్ల కలలు వేనవేలు
వేవ్వేరు ఒంటరితనం

కలపలేనివి
కలిసి ఉండలేనివి

సూదికీ తెలుసేమో

Monday, January 09, 2012

నా లోపలి కుక్క నిద్రపోయింది

ప్రతి ఆలోచనలో ఖాళీ అక్షరాలు
ఏది రాసినా మాటవ్వదు

మాటలతో ఆలోచించే మాటలు
నావద్ద లేవు

వొట్టి విడిచిపెట్టిన అక్షరాల్ని
కలిపి మాటల్ని చేయలేను

ముడుచుకుపోయే వాక్యాల్లో ఎన్నో ముడతల ముసుగులు
ఎంత తొలిచినా కనిపించని ఆలోచనలు

వింటున్నా ప్రతి చీకటిని

ప్రతి చీకటీ అద్దంలోకి చూడాలనే

ధన్యురాలు
శ్వాసించని పుష్పం

నీకు నేను తెలియదు
తెలియని నీకై నేను అని ఎప్పటికీ అద్దం అనదు

వెక్కిరింపు రక్తమే

వ్యాకరణ అనుమతి

ఉబ్బుతుండే నిశ్శబ్దం
చిల్లుల నీడై

గోడలన్నీ లోలోపలికి ముడుచుకుపోతూ
ప్రాంతాలన్నీ లోలోపలి బైటికి తెగిపడుతూ

ప్రతి అనుభవం ఓ ఖాళీ ప్రతిధ్వని

~~~

వివిధ,
ఆంధ్రజ్యోతి, 09/01/2012

Tuesday, January 03, 2012

a fake dream


మళ్లీ మునగాలి
వివర్ణవాయువు లోపల్లోకి

అతుక్కుంటూనే ఉండాలి
పగిలిన పదాల్లోని పదాల్నే

రక్తం చిందని మరణమౌనం
రంకిలేసుకుంటూ నాలోకి