ఈ వెలుగుని రంగులతో నింపి వెళ్ళిపోయినా
చీకటిని నింపటానికి ఏ రంగులు కావాలి
దృష్టి దేహంతో
సృష్టి పరవశంతో
నీ చీకటికి నా చీకటికి యెంత తేడా
యిరువురమే
ఆకుపచ్చటి కాళ్ళతో
ఒంటరి నేత్ర స్వప్నాల్లో
తలుపులు తెరిచే
నీటి తలుపులు
నోటితో కొన్ని మాటల్ని తెరుస్తాం
మూసేస్తాం కల నోటిలోకి
యిరువరమే
చీకటిలోకి చీకటి కదలటం కలవరిస్తున్నాం
చీకటిని నింపటానికి ఏ రంగులు కావాలి
దృష్టి దేహంతో
సృష్టి పరవశంతో
నీ చీకటికి నా చీకటికి యెంత తేడా
యిరువురమే
ఆకుపచ్చటి కాళ్ళతో
ఒంటరి నేత్ర స్వప్నాల్లో
తలుపులు తెరిచే
నీటి తలుపులు
నోటితో కొన్ని మాటల్ని తెరుస్తాం
మూసేస్తాం కల నోటిలోకి
యిరువరమే
చీకటిలోకి చీకటి కదలటం కలవరిస్తున్నాం
4 comments:
చాలా బాగుంది నాయుడూ
నాకూ నచ్చేసిందిది:-)
నాక్కూడా నాయడూ! నిన్ను నువ్వు వదులుకోకుండా లోక తంత్రులు మీటడం బాగుంది. నువ్వూ (నేనూ) ఉండాలి, లోకమూ ఉండాలని అనుకుంటానేమో; అందుకని ఈ పొయెమ్ తెగ నచ్చేసింది నాక్కూడా
Thank you Anon, Padmarpita garu n HRK garu.
Post a Comment