Blog Archive

Followers

Saturday, November 16, 2013

ఎరసం

ప్రతి చిగురు చెట్టుని ఆక్షేపిస్తుంది 
ప్రతి చెట్టూ చిగురునే ఆక్షేపిస్తుంది 

"ఇంకొంచెంసేపు"
అనాక్రోశ శ్వాసే అనుకుంటుంది 

దుప్పట్లు చప్పట్లు ఓ బైక్షము 
పదాలూ అంతేనా 

శ్వాస ప్రయోగాలేనా అక్షరాలంటే 
స్వార్జిత ఆర్థిక స్తోమత ఇప్పటికీ ఏ కంటికీ లేదే 

దిక్కుమాలిన మనుషులే 
ప్రతి సమాధిలోకి 

ఎరసం 
ప్రతి నెత్తుటిలో 

Tuesday, October 29, 2013

పుట్టని పదంలో

అపహాస్యం కావాలి కన్నీళ్ళకి 
రెక్కలు కొట్టుకునే బాధతో 
ప్రతిరూపాలే కాని రూపంతో 

అప్రయోజక ప్రేమకై 
కలలపై కలలు కలంకారి కాలంలో 

దక్కని దారిలో నలుపే తెలియని రహస్య శ్వాస 
ఏ ఆకర్షణాలేని అక్షరాలు అద్దంబైట 

వణుకై రాత్రంతా విషమై ముసిరి 
అప్పటి చూపుకై మరలి మరలి 

జారే నరకిన నేత్రాలు 
మారే విరిగిన మాటలు 

దూరమే దూరం 
పుట్టని పదంలో 

గాలే తెలియాలి గాలిలో 

Saturday, August 31, 2013

నాలోకి

రెక్కల్లేని పదాలతో ప్రేమని కోరుకోలేను 
ప్రేమించే పదాల్లో లెక్కలు కోరుకోలేను 

జీవించటం ఓ ఎదలేని కురుపు 

సందర్శించే సందర్భసమయం ఓ అధికార వాంఛ 
వర్ణించే వర్ణం మౌనమే 

తడిచిన ఆలోచనల్లో 
కుళ్ళిన కన్నీళ్లు 

మసి మాటలో 
మాటల మసో 
గుండెలో ఓ స్మరణ నిష్క్రమణ 

నల్లటి నవ్వు 
నాలోకి 

Friday, August 16, 2013

పదాల పసితనం

సూచించే పదాలే 
సూచించని పదాల మధ్య వో చిక్కని పదం వేళ్ళాడుతూ 

తయారు చేసే పదాలు కొందరికే అందుతాయి 
అదృష్ట అంధకార స్వప్నంలో 

దొరకని దుఃఖం 
దిగులు మిగులు 

నిష్కపట మనసు రొమ్ముల్లో 
నిజాయితీ ఎంత 

దేహమో, దుర్మార్గామో 
దేహీ అనాల్సిందే 

పసితనం కోల్పోయిన పదాల్లో 
పదాల పసితనం ఎంత 

అలసిన నేత్రాల్లో 
అక్షరాల్ని వెదకకు 

కొన్నే అబద్ధాలు 
అక్షరాల శ్వాసలో 

కోరుకునే కోరికలే 
నిరక్తరుతువులు 

రిక్తపదాలు ఏ నేత్రాల్లోనో 

Thursday, August 08, 2013

అలల సమాధుల్లో

ఉత్త పెదాల్నే కడుక్కుని వొస్తాను 
పెదాల్ని అక్కడే వొదిలి 

కాస్త నిరాకరించే అక్షరాలు 
ఎప్పటికీ లేని మౌనంలో 

అలవాటుకాని ఆకారాలతో పదాలు 
పెదాలే అలవాటైన అలల అలక కలలో 

ఉజ్జాయింపు జోల ఛాయలు జాయ్లు బైబైలు 
మాటల వేళ్ళ చివర్లుంచి 

ఇంకా నిర్మితంకాని వృక్షాల్లో 
నిర్మించిన పశువులు, పక్షులు, ప్రజలు

అనుటకు, అనుకొనుటకు 
యే స్పర్శ కావాలి ఈ పంది కళ్ళకి 

సురక్షిత అలల సమాధుల్లో 
ఓ స్వాపము 

Sunday, August 04, 2013

నీలో ఉందా

అంత నిద్రలేదు నిద్రలో 
నమ్మలేని రేపటి నిద్ర 
దరిదాపులో లేదు 

నిశ్శబ్ద యోని కాంతి 
ప్రతి చిగురులో 
ఎవరి ఉదయమో అది 

అంతమయ్యే అద్దం అడ్డమే 

నీలో ఉందా 



Monday, July 15, 2013

జ్ఞాపకాలే జననజ్ఞానమా?

అక్షరాల చోద్యం చూడాలి
చూసే కళ్ళకి అక్షరాలు తేవాలి

దుర్గతి రాత్రిలో రాతి రతి

నేత్రాల్ని మోసుకెళ్ళే యాత్రిక యాంత్రిక యోని జ్ఞానీ
శుభ్రపరచని స్వప్నంలో యింకెంత కాలం ఏ కాలమైనా

నిశ్శబ్ద నిశ్శబ్దంలో నిర్మాణ నిర్యాణం
వీరులు వీర్య విక్రమాదిత్యులు విరామవెక్కిళ్ల చీకటి

బురద దురద బతుకు మెతుకు గెంతేలోపే గెంటేయాలి గోతిలోకి దిగిపోవాలి
అయోగ్య పశ్చాతాపాల జ్ఞాపకాలే జననజ్ఞానమా

వెతికే నీడ ఎవరిదో


Sunday, July 07, 2013

ఏ నేత్రంలోనో

తుడిచేసుకోవాలి తడిలేని తలపులని తలుపుల్ని తడి అంటకుండా 
అంటేమో అంటాము అనుకుంటాము ఆనిందాచాలి కదా 

నిష్ఫల ఛాయల్లో ఓ ప్రేమ వాక్యం మోసం చేసి చూడాలి 
సులోచనా దర్పనరహస్యం ఓ చిరగని పదం 

అపరాధ మాత్రలేవో మింగుతుంటే 
స్వాధీన మాటలే మాటలపై మాటలై  మాట్లాడవు 

దాటెల్లే మనసు మౌనంతో ఎందుకీ సంభాషణ 
కొండల్లోని మేఘాలు నిన్నే చూస్తాయా 

గత రాత్రిలో లేను నేను 
అలా ఉన్నా ఉన్నాని ఉన్నానో తెలియదు 

ఉపేక్షించే ఊహల్లో 
ఊహాజనితం జన్మ 

ఘనీభూత అస్తిత్వం పరోక్షమే 
నిశ్చల వ్యసన చలనం 

మెలితిప్పే మౌనం 
ఏ నేత్రంలోనో 

Wednesday, July 03, 2013

మరోసారి మరెవరో

ఇదో రాత్రంతే
మరోసారి అదే రాత్రి

ఎంత రాత్రో ఎవరికి తెలుసు
మరోసారి ఏ రాత్రో ఎవరూ లేకుండా

ఏమీ అవ్వలేను
ఏమీ అవ్వనవ్వదు
ఏమీ అనదు
ఇదో రాత్రిలేని రాత్రంతే

గుండ్రటి కళ్ళల్లో కలలెన్నో
సమాధులపై తేలే మనసులెన్నో

ఏది ఏదెక్కడో రాత్రికెందుకు
చూసేవి వినిపిస్తుంటే

దేహం ఓ అనిశ్చిత ఫుల్ స్టాప్
నాలుకతో శవాన్ని మోయాలి

అద్దాల్ని నీడల్తో కడిగి
నీడల అద్దాల్ని చదవాలి

మరెవరో మరోసారి
మరోసారి మరెవరో
మడతల మగతల ముసుగులో

తీరంలోని గులకరాయితో
ఆడుకుంటూ అలలు

Thursday, May 30, 2013

బతుకు క్రితం ఓ కల క్రితం


1. బర్వుగా జారిపోతాం.
 జరాస జర్దా జల్దీ జిందగీలో. బాబా రత్న రంగుని పులుముకుంటూ నములుకుంటూ. తేలు కొండెం చీకటిలోకి ఆలోచనలు లేని ఆలోచనలలోకి. మనసుని గోక్కుంటూ. 

2. బర్వుగా తేలిపోతాం.
 ఏ ఊరెళ్ళావో ఎవరికీ చెప్పకే. tabula rasa. తబలా తలల జ్ఞాపకాలు, హార్మోనియం నేర్చుకోవటాలు, బొమ్మలు గీయటాలు, spells of tranquilityని పట్టుకోవటాలు తేలిపోయిందెక్కడకో. యిపుడెవరికి కాపలా యీ వుత్తరాలూన్నూ. ఎవరికైనా చెప్పి తిరిగొచ్చేయ్ మొగల్ సరాయ్ లో కలుసుకుందాం. ఓ గోధుమ రంగు స్నేహంలో. గో. గో. ఇళ్ల కప్పుల్నీ, కప్పల్నీ, కాళ్లనీ, కన్నీళ్ళనీ, కాకి ఇంద్రధనుస్సుల్నీ విడిచి. ఇడిచి. 

3. బర్వుగా నానిపోతాం.
నాన్న కొట్టారా. భార్య చనిపోదెప్పటికీ. అమ్మే మిగిలి. మిగిలి. నాన్నే రగిలి. పగిలి. గిలి గిలి సిల్లీ చలి. గిల్టీ గాలిబ్ ల లబ్ డబ్ లు యిక వినిపించవులే. రబ్బరు రెక్కల రక్తం తొంగిచూడదులే. రేపటి గురకలు గుర్రమెక్కాయా. వలస కలవరింతలే కనికరించాయా. అసలు పక్షులు యెగురుతాయా. 

4. బర్వుగా కాలిపోతాం.
 నలుపు మంచు ఉరుముల ఊపిరిలో. ఎప్పటి రాత్రైనా వొహప్పటి జ్ఞాపకమేనా. దీపానికి తెలుసా సమయమెంతైందని. దేహానికి తెలుసా మరణమెంతైందని. ఆర్పు. ఆర్పు. నిద్రనదిలో మరుగుతున్న మంటల్ని. 

5. బర్వుగా చూస్తుంటాం.
 గది లోపలి లోపలి గదిలో గది గది గది లోపల లోపల లోపల గదిలో. కాళ్ళీడుస్తూ చూపులు. వొళ్లు విరగ్గొట్టుకుంటూ చూపులు. cosmic consciousnessలోకి 'నన్ను'ని వెతుక్కోవాలని చూస్తూ స్తూచూ చూస్తూ స్తూచూ వెళ్ళావా. నీ లోపలి గాలిలోకి. వీధిలోకి. 

6. బర్వుగా గడ్డకడతాం.
 ' ఊదా నీలి జాలి - / "నిబద్ధతే" ఇదంతా ' అంటూ నన్ను నడుస్తున్న నీడల్తో, తాటిచెట్టంత రంగులతో నడుస్తున్నప్పుడు, ఎవరో నన్ను పీక బిగించిన నాలుకతో, నాలుకంత పీకని బిగించిన చీకటిలో గడ్డకట్టలేదూ. 'కోరతనపు అమాయకత్వం తెరలతో కప్పబడిన వికటాట్టహాసంలాగా, తలనరకబడిన కొబ్బరి బొండాంలాగా, మాసిపోయిన మొన్నలాగా,' ఓ వెర్రినవ్వు గడ్డకట్టలేదూ. 

7. బర్వుగా ఖలరవుదాం.
 ' గోళీసోడా కొట్టినపుడు ఖయ్యిమంటూ మొదలుపెట్టి కీచుమంటూ దిగిన శబ్దపు ఖలరుందే, ఆ ఖలరండీ... ఒక నయంకాని ఏకాంతంలోకి... అంతటి అర్థరాత్రిలోనూ దూరంగా ఒక మిత్రుణ్ణి కలుసుకోవాలని ఉంటుంది అతనెలా ఉన్నాడో కనుక్కుందామని... ఆ ఖలరండీ... ఇంతకీ, ఆ ఖలర్లోని వేడి, వెలుతురు సరిపడ్డాయా?

Sunday, May 26, 2013

స్వప్న సువాసన

సముద్రం తిరగటం ఆపేసింది 
ఎండు చేపలై  అలలు 

ఆమె ఆదరణలో 
దుఃఖం చిన్నబుచ్చుకుంది 

కలల వానలో 
పార్ధీవ నేత్రాలు 

నిరాశ్రయుడి గృహంలో 
ఎడారి గాలిని తింటున్నా 

పిచుకల సమాధిపై 
నీడల సీతాకోకచిలుక

స్వప్న సువాసన 
దేహం లోపల 

ప్రార్ధించే పదాలు 
మరో రోజులోకి 

Thursday, May 23, 2013

గులకరాయి


సహనశీలీ!

యాత్రికుడివై 
సూర్యకిరణశ్వాశలో 
నీరవమృత్తికలోఅనాధప్రేమతో 

కామాకామకోమకోతితోకౌగిలేల 

మౌర్నింగోమార్నింగోమౌనింగో 
సమూహసంభాషణాస్పర్శలేల 

ఖాళీఖడ్గం
జాలీజూదం 
విచారసంసారసంచారమేల 

స్నేహమేళా!
ముఖమేళా!

అద్దమేగులకరాయి 

Tuesday, May 21, 2013

గాలి బావి

వినిపించదు గాలి అలల నిశ్శబ్దం
నక్షత్రాలు చెవులు రిక్కించనా 

ఖాళీవాయువే తనువు తీరాన్ని 
తట్టిపోగలదు మాటలు రెట్టించినా 

యింకా మెలిపెట్టే పదాల్తోనే 
నీ ముఖం ఎందుకు కనిపిస్తోంది 

పంజరాల పంజా మాటలు 
నీ ముఖంలో వేనవేల నోర్లతో నవ్వుతోంది 

వాననీడల ఊడల సుహంలో 
యే వూయలో నీ అడవిలో 

రాత్రీ
నీ నీడ పొడవులో 
నేనో మరుగుజ్జుని 

స్వప్నదుఃఖాలు నీ అడుగులేనా 
నీ చేతులతో నా రాత్రిని తిరిగిచ్చెయ్ 

వినని మాటలలో 
నీ పెదాలపదాలు లేనివి ఎన్ని 

నీలో గాలి బావిని తోడుకో 

Saturday, May 18, 2013

యెలాచనిపోతామో


యికవుండుహాయిగాగాయాల్తోగేయాల్తోపాలినగాలినీడలభోగిమంటలో 
ఆదివారంమబ్బులఅలలుపొంగికుంగిన మాంగళ్యమంత్రాలచెమటలో
కేశాలునిద్రించేరెక్కల్లోయేరాత్రితెలుపోకన్నీటిపెదవికనుపాపల్లోపాపాల్లో 
మిమ్మునుచూసేఆలోచనలేవినినతమషాలతొడలకడలిజల్లినమేఘాల్లో 

దిగంబరగంధకళేబరంఅంబరం

దొరికిందామనసుబంతిదారి
మరిచావాయెగిరినగాలిబొంగరందాడి 

నిర్లజ్జన్యాయయోనేశిలాశాశనం 
యేసర్పమోపలకపైపడకపై  

యెలాచనిపోతామోదేహంయెవరికైనచెప్పిందా


Sunday, May 12, 2013

మూత్రముఖం


అక్షరాల్నీ చునాయించు 
చనువులేని పదాల్తో మోహించు 
నీచం అక్షరం 

ఆకలి అద్దంపై ఏదైనా తుడిచేయొచ్చు తినొచ్చు 
దేహపాళిపై పిరికి నామరులు 

నిద్రమత్తుకి అడ్డం అద్దం 
నిద్రమత్తుకి దేహం అడ్డం 

వూరించే మాటల వోదార్పు యెవరికో 
నేను నాలో ఉన్నానా ఎప్పుడైనా 

నేత్రం మూత్రం 

Thursday, May 09, 2013

లెక్కపెట్టకు

వొకఅక్షరాన్నే 
యోధుడ్నికాదు 

కాలంలోకాలంతోనగ్నమైత్రితోఉన్నా 
తలిదండ్రులనగ్ననేత్రంలోతిరుగుతున్నా 

వొకచూపులేన్నోణ్నే 
అన్నీకనిపిస్తాయ్ సాక్షాలై 

యుధ్ధంప్రతిమైత్రిలో 
ప్రతిపదంవోబలి 

కొట్లాటఅక్షరాలేకనుపాపలై 
గర్భంలోరక్తంలేదు 

రవంతశవపేటికప్రతిఅక్షరం 
ప్రతిఅలవోసమాధి 

నిద్రించేయింద్రియాల్లోపదాలు 
వోటివూటవోటములు 

వొప్పుకోకువొడిలినవ్యాకరణాన్ని 
మరణంలోఅక్షరాల్నిలెక్కపెట్టకు 

Monday, April 29, 2013

నేల రాలాను

ఆకునై
నేల రాలాను

నీటినై
ఆకుపై వాలాను

జారాను
కాస్త ఊపిరి తీసుకుందామనే

ఏ కొమ్మలోకో ఆకు ఎగిరింది
ఏ చెమ్మలోకో నీరు చేరింది

జారాను
ఊపిరి తీసే నిశ్శబ్దంలో

Sunday, April 28, 2013

సగం దీపంలో

నీడ మార్చిన చివరి పదంకై
చీకటి వెతికిన చితికిన వెలుతురులో
రాత్రి రాత కంచె ఎక్కడో

కొరగాని ఆపదలే
ఆప్త పదాలు

గూఢమైన కలవరింతలేవో
గిర గిర తిరగని రోత ఎదురుచూపులు

యిక్కడ ఏదీ లేదు
గాలి నీడల గజిబిజి జిగిబిగి

Friday, April 26, 2013

ఉబ్బి + పొంగు

శైలూషీ!

గాలి ఆగదే


కన్నీటి తలుపులు మూసినా 

మెరిసే ఒంటరి చీకటి


 కాస్తంత
తెరిస్తే

కొంచెం పారిపో పాలిపో
పాలిచ్చిపో పొడిచేయ్

ఫొటోలో తోలు కనిపిస్తే
రంగులేసుకునే అక్షరాల్ని తొడుగు

తొడపై సూర్యుడి నీడ
మరెవరిదో మరెవరికో చూపించు

మైమరిచిన రునాత్మకత
ఫిర్యాదు లోలోపలే

అనుకొంటాను
నిద్రొక దండన

ఆమె నవ్వదు
నువ్వే నవ్వుకో

మాటిమాటికి
అదే అవస్థ మాటలు 

గుడ్డి పుట్టుమచ్చలు 
కన్నీళ్ళపై  

Saturday, March 30, 2013

ఆమెకి

ఎంత దయో
ఆమెకి

నన్నే క్షమించింది
నేలపై రాలిన పూలతో

ఆమె
చివరి మౌనం నాలోకి

ఇంకెంత దూరంలే
ఇంకిన మతి ఊపిరిలో 

Friday, March 22, 2013

అంతకుడు

అవే అలసిన రాత్రులు

అవే అలవని మాటలు 


అవి ఎవరికీ చెందలేదు


ఇంద్రియాల ఇంద్రజాలంలో



చెరో వైపు

ఎవరికీ మారుమాటలు లేవు



అవే కదలని అలలు


అవే ఎగరని మిణుగురులు

నేత్రనక్షత్రాల్లో చల్లటి చీకటి 

Thursday, March 21, 2013

వెలుక


నిరాళుడా! 


చిటుకుపొటుకు మాటల్తో
బద్దలైన బాధల్తో
కలల్ని కలగనే కలలతో
నీ కంపిత కళ్ళల్లోకి నువ్వే తొంగి తొంగి
చూస్తుంటావు మతిమరుపు నవ్వుతో
ఖాళీ జాలితో


సంతాపవృక్షంపై కాంతి కరిగిపోతుంటే
మరొకరి చేతులతో అన్నీ స్పర్శిస్తూ
ప్రత్యక్ష విమోచానాశ్రువుల్ని
దిగ్మండలిలోకి ఎగరేస్తావు


విప్పేసిన జ్ఞాపకాలనే
తిరిగి తిరిగి తిరగేసి తొడుక్కుని
మరణప్రవాహపు నీటిలో ఈదుతావు
నిశ్శబ్దాన్ని నిశ్శబ్దంతో వింటూ
వింటూ తేలిపోతుంటావు


వెన్నెముక వెన్నెలతో
నీ చీకటిని తయారుచేసుకుని
మరొకరిలోకి తర్జుమా చేసేలోగా 
అద్దంలో నీ పోలికలతో
నీ ప్రియురాలు ఆమె ప్రియుడు కనిపిస్తారు


అర్థరాత్రి దేవుడు నీకో వరమిస్తాడు
నీ చెవిలో ఎల్లప్పుడూ ఓ గుడ్డి చేప
శాశ్వతంగా జలక్రీడ తపస్సు కొనసాగిస్తుందని

Wednesday, February 27, 2013

ఎడారి ముత్యాలు

రంగుల్ని సూచించే
గాలినీడ కిందో 

గాలినీడ పైనో 
రక్తపునీడ లోపల
రక్తపునీడ అవతల నువ్వే నీ నువ్వుతో

తీర్థవాసీ!

మాయాదేవి నేత్రాల్లోకి ప్రవేశించి
యేమి చూశావో
వోనమాల సర్పభాష నేర్చి
యేమి పలికావో
దుర్గంధాశ్రువులతో సిలసిల దుఃఖించి
యేమి కనుగొన్నావో
పకపక నవ్వి
ఎవరికైనా చెప్పావా

దురాత్ముడా!

చీకటి పెరుగుతోంది
చీకటి ఊడేలోగా నీలోని నువ్వులోకి చేరిపో
ఎడారి ముత్యాలు యేరుకోవాలిగా

Sunday, February 24, 2013

అదృశ్య క్షణం

కల కనిపించక

యింకా నిద్దట్లోనే


నిరాధార స్వీయ సంభాషణనే

తిలకిస్తున్నట్టు తిలకిస్తుంటే

వింటున్నట్టు వింటుంటే


అసూయ ఆక్షర్షణే

యేదో రూపం వొదిలీ వొదలక

కదిలీ కదలక

కలత మాటల లతై

యెవరూ చూడని కళ్లతో

అటే యెగిరి

జీవిస్తామేమో అదృశ్య క్షణంలో



Saturday, February 23, 2013

నిశ్శబ్దజిహ్వ

ఆ ముఖంలో రుచి కనిపించక
నాలుకతో నిర్మించిన నిర్లిప్త నిరీక్షణే
అప్పటి వో కాలపు సాయింత్రపు
సూర్యశబ్దాల ఆఖరి నిశ్శబ్దజిహ్వకై
స్వప్నాసనాలు నేర్పిస్తుంటే
యెప్పటి వూపిరి యెముకల్లోకో
పర్వత పాదాలు తడవటానికి
అనుసరించే ఆలోచనలు


క్షీణత
పక్షవాతపు క్షీణత
వాసనల క్షీణత


తాబేటి తలలో నీడల్లేని మాటల వంతెన
నేలను తాకే కల
గుడ్డి నవ్వు


మోకరిల్లాలి జ్ఞాపకాల కాళ్ళపై
యెవరి ఆత్మో నీహత్య చేసేయ్
బ్లేడుతో పరాయి అద్దాన్ని కోసేయ్
లో అద్దాల లంగాల్ని లాగి పారేయ్
ప్రేమాంగాల్లో దూరిపో
గాల్లోని గాలిని గ్లాసులోకి గిరాటేయ్
ప్రాంతీయ అంధత్వం కెవ్వు కేక


నోట్లో ఆ అంగాలు తిరగకపోతే తప్పిపోతావ్
అనుభవాలు ఆలోచనల్ని నిరూపించేలోపే
కళ్ళకి నాలుకలు విషాన్ని తాపుతాయ్


నిధనము లభించు ఎల్లవేళలా

(http://vaakili.com/patrika/?p=1554)

Wednesday, February 20, 2013

శాశ్వత శ్వాస

కాయితాలే ఊపిరి పీలిస్తే
అక్షరాల్లేని మాటలే పదాలవుతాయా

ముక్కంటిపండులో
ఏ సూర్యముఖమో

ముగితి గోతికై
అవికల ఆరోగ్యం

రోబో గ్రంధులే అందరిలో
అసుఖపుష్పాలే హృదయంలో

ఏదీ
నిరంతర శాశ్వత శ్వాస

అసమాధానాలే
కాయితాల కౌగిలంతలో

Wednesday, February 13, 2013

గాడిదంత ఫుల్ స్టాప్

వో వొణుకు
నేత్రంపై క్షీణిస్తే

చూసే వినికిడంతా
యే కలగన్న కలదో

గాడిదంత  ఫుల్ స్టాప్
ఆపలేని తలరాతలు

యే మట్టో
శ్వాసల్ని వూపిరాడనియ్యట్లేదు

తడవాలి అక్షరాల
నిద్రదారుల్లో

అవొంటరితనం
చివరి పాదం మరకలు

చెవితో చూస్తూనే
చీకటి చీమలోకి యెగిరాను

నిద్రెవరిదో దొరికింది
యిక దొంగిలించాలి

Friday, January 25, 2013

అవతలి ఆవలింత

శూన్య అశబ్దంలో జ్వలించే
జననం మరణమంటావా

అన్ని ఎన్ని
రాత్రులులేని తలరాతల చావు
ఏమి చెప్పిందో విన్నావా

చూసే చప్పుడే జీవితం

స్మరణవాయువేదో నేత్రఛాయలో

భీతిల్లే ప్రేమే ఓ రహస్యవిషం

ఎన్ని గ్రాములు ఈ మరణవర్ణం
అవతలి ఆవలింతల బూడిద కన్నీటిలో

Friday, January 18, 2013

నిర్వాణబంధం

స్నేహితులే సరిహద్దులు 
మరణానికీ ద్రోహానికీ 

నిర్వాణబంధం అనేత్ర శబ్దంలో 

రోగశరీరమే శాపశాంతి 
చీకటిచితి నీడలు 

కాలపు కాలభైరవుడి మెడవొంపు రాత్రిలో 
పిట్టల గురక 

సరికొత్త కైవల్య అంగవైకల్యం 

మౌనం 
శూన్యస్వర్ణ గగనంలో ఓ సంభాషణ 

స్మృతుల పరాధీనతే 
శ్మశాన సన్మానం 

కొనవూపిరి చమురు కాళ్ళతో 
కనురెప్పల పడవలు 

స్నేహితుడా 
ఎక్కడ చనిపోయావ్ 

Thursday, January 10, 2013

వరమివ్వు


కన్నీరే నిలవని కంటితో 
నిన్ను చూస్తే నన్ను క్షమించు 

నీరే నిలవని అలనై 
నీతో మాట్లాడితే నన్ను మన్నించు 

అడుగుజాడలులేని నా ప్రేమ 
నీతో ద్వేషిస్తే నన్ను మందలించు 

నిన్ను తాకే స్వర్గప్రేమ 
నాకు ప్రసాదించు