అపహాస్యం కావాలి కన్నీళ్ళకి
రెక్కలు కొట్టుకునే బాధతో
ప్రతిరూపాలే కాని రూపంతో
అప్రయోజక ప్రేమకై
దక్కని దారిలో నలుపే తెలియని రహస్య శ్వాస
ఏ ఆకర్షణాలేని అక్షరాలు అద్దంబైట
వణుకై రాత్రంతా విషమై ముసిరి
అప్పటి చూపుకై మరలి మరలి
జారే నరకిన నేత్రాలు
మారే విరిగిన మాటలు
దూరమే దూరం
పుట్టని పదంలో
గాలే తెలియాలి గాలిలో

No comments:
Post a Comment