స్నేహితులే సరిహద్దులు
మరణానికీ ద్రోహానికీ
నిర్వాణబంధం అనేత్ర శబ్దంలో
రోగశరీరమే శాపశాంతి
చీకటిచితి నీడలు
కాలపు కాలభైరవుడి మెడవొంపు రాత్రిలో
పిట్టల గురక
సరికొత్త కైవల్య అంగవైకల్యం
మౌనం
శూన్యస్వర్ణ గగనంలో ఓ సంభాషణ
స్మృతుల పరాధీనతే
శ్మశాన సన్మానం
కొనవూపిరి చమురు కాళ్ళతో
కనురెప్పల పడవలు
స్నేహితుడా
ఎక్కడ చనిపోయావ్
3 comments:
విషాదాన్నీ మరణాన్నీ
ఎక్కడా ఎవరూ అసలేమీ
బాగాలేకపోవటాన్ని గురించి
ఇంత బాగా ఎలా చెప్పగలవు నాయుడూ..
ఈ విషాదం బాగుందని ఎవరు చెప్పగలరు?
పువ్వుల్లో గాయాలు చూసినవాళ్ళు
గాయాల్లో పువ్వులై మొలిచినవాళ్ళు
అబ్బే అసలిదేం బాగోలేదు.. అయినా
ఈ చేదేదో తియ్యగానే ఉంటుంది
ఇదెప్పుడూ తియ్యగానే ఉండాలంటే
ఇది చేదై ఉండాలి...
గగుర్పొడిచే సంభాషణం అనేకానేకంతో
evaru babu droham chesindi pyga ninnu droham chesindi
naayane!!
Post a Comment