ఉత్త పెదాల్నే కడుక్కుని వొస్తాను
పెదాల్ని అక్కడే వొదిలి
కాస్త నిరాకరించే అక్షరాలు
ఎప్పటికీ లేని మౌనంలో
అలవాటుకాని ఆకారాలతో పదాలు
పెదాలే అలవాటైన అలల అలక కలలో
ఉజ్జాయింపు జోల ఛాయలు జాయ్లు బైబైలు
మాటల వేళ్ళ చివర్లుంచి
ఇంకా నిర్మితంకాని వృక్షాల్లో
నిర్మించిన పశువులు, పక్షులు, ప్రజలు
అనుటకు, అనుకొనుటకు
యే స్పర్శ కావాలి ఈ పంది కళ్ళకి
సురక్షిత అలల సమాధుల్లో
ఓ స్వాపము
No comments:
Post a Comment