సూచించే పదాలే
సూచించని పదాల మధ్య వో చిక్కని పదం వేళ్ళాడుతూ
తయారు చేసే పదాలు కొందరికే అందుతాయి
అదృష్ట అంధకార స్వప్నంలో
దొరకని దుఃఖం
దిగులు మిగులు
నిష్కపట మనసు రొమ్ముల్లో
నిజాయితీ ఎంత
దేహమో, దుర్మార్గామో
దేహీ అనాల్సిందే
పసితనం కోల్పోయిన పదాల్లో
పదాల పసితనం ఎంత
అలసిన నేత్రాల్లో
అక్షరాల్ని వెదకకు
కొన్నే అబద్ధాలు
అక్షరాల శ్వాసలో
కోరుకునే కోరికలే
నిరక్తరుతువులు
రిక్తపదాలు ఏ నేత్రాల్లోనో
No comments:
Post a Comment