Followers

Wednesday, July 03, 2013

మరోసారి మరెవరో

ఇదో రాత్రంతే
మరోసారి అదే రాత్రి

ఎంత రాత్రో ఎవరికి తెలుసు
మరోసారి ఏ రాత్రో ఎవరూ లేకుండా

ఏమీ అవ్వలేను
ఏమీ అవ్వనవ్వదు
ఏమీ అనదు
ఇదో రాత్రిలేని రాత్రంతే

గుండ్రటి కళ్ళల్లో కలలెన్నో
సమాధులపై తేలే మనసులెన్నో

ఏది ఏదెక్కడో రాత్రికెందుకు
చూసేవి వినిపిస్తుంటే

దేహం ఓ అనిశ్చిత ఫుల్ స్టాప్
నాలుకతో శవాన్ని మోయాలి

అద్దాల్ని నీడల్తో కడిగి
నీడల అద్దాల్ని చదవాలి

మరెవరో మరోసారి
మరోసారి మరెవరో
మడతల మగతల ముసుగులో

తీరంలోని గులకరాయితో
ఆడుకుంటూ అలలు

No comments: