Blog Archive

Followers

Tuesday, May 21, 2013

గాలి బావి

వినిపించదు గాలి అలల నిశ్శబ్దం
నక్షత్రాలు చెవులు రిక్కించనా 

ఖాళీవాయువే తనువు తీరాన్ని 
తట్టిపోగలదు మాటలు రెట్టించినా 

యింకా మెలిపెట్టే పదాల్తోనే 
నీ ముఖం ఎందుకు కనిపిస్తోంది 

పంజరాల పంజా మాటలు 
నీ ముఖంలో వేనవేల నోర్లతో నవ్వుతోంది 

వాననీడల ఊడల సుహంలో 
యే వూయలో నీ అడవిలో 

రాత్రీ
నీ నీడ పొడవులో 
నేనో మరుగుజ్జుని 

స్వప్నదుఃఖాలు నీ అడుగులేనా 
నీ చేతులతో నా రాత్రిని తిరిగిచ్చెయ్ 

వినని మాటలలో 
నీ పెదాలపదాలు లేనివి ఎన్ని 

నీలో గాలి బావిని తోడుకో 

4 comments:

భాస్కర్ కె said...

చక్కని కవిత, చిక్కగా వుంది,.

b.ajay prasad said...

good poem.. after long time..

Padmarpita said...

బాగుందండి మీ కవిత. అభినందనలు!

ఎం. ఎస్. నాయుడు said...

thank you all