నిన్నటి గ్రహణం రేపూ కొనసాగుతుంది అలల కళ్లపై కలల పసుపుతో
తోమిన తెల్లటి తిలకం దిద్దుకుని ఏ అరచేతులపైనో నీడలై కొమ్మలై రోజూ
పలకరించాలని పలకపై దారంతో అక్షరాల్ని కట్టేస్తావు కొంత
కాలాన్ని కన్నార్పకుండా కన్నీళ్ళతో అదేదో ఘటన మరో చిహ్నంతో కొత్త తేడా
మనలోకి వచ్చినా రానట్టే అమాంతం చుట్టుముట్టినా చెరిపేస్తాం ఒకే ముడిని
మనిద్దరం బిగిస్తాం బిగుతుగా బిగ్గరగా వినపడదు అది ఊడుతున్నప్పుడు ప్రశ్నలే
అప్రశ్నలే సంజాయి కెంజాయి ఎంజాయి గంజాయి గుంజాయి మెడ నరాలు తొడ రక్తాలు
పగిలిన బుడ్లో బిడ్డలో బొడ్లో ఎప్పటికీ దాచుకోక కోకనీ
లంగోటినీ కృష్ణార్పణం గంగార్పణం ఏ దప్పనమూ దూరని దర్పణంలో వొదిలేస్తాం ఊక
ఊక నల్లటి ఉక్క చిమ్నీలో ఉగ్గిన్నిలో ఖర్చుపెట్టని పెదాల్లో దేహాతీత తీట
ద్వేషం కళ్ళని కన్నీళ్ళల్లో దోపి అలా చూస్తూ చూస్తో ఉంటున్నామా ఊపిరాడిస్తూ...

1 comment:
tautological
melancho-alcoho-lic
inhaler
Post a Comment