ఆ కిటికీ లేదు
పూల కిరీటాల గాలీ లేదు
మరపునిచ్చే ఆకార అక్షరాలూ లేక
ఏ యంత్ర యాత్ర యోనిలోనో తపస్సులోనో నువ్వుంటావ్
అదృశ్య అధీనంలో ఆధార అశ్రువై
మూగ ముఖంతో కనిస్పిస్తావంతే
ఇరుకిరుకు ఇంద్రియాల ఇంద్రజాలం
ఓ విన్యాస విధ్వంసం
మరో ఇమడని పగటిలో
పొలమారిన ఊహలు
ఎవరూ ఉండని అద్దంలో
ఎవర్ని వెతుకుతావ్
చీకటి చేతుల్తోనే తెరవాలి
కిటికీనైనా, గాలినైనా
పూల కిరీటాల గాలీ లేదు
మరపునిచ్చే ఆకార అక్షరాలూ లేక
ఏ యంత్ర యాత్ర యోనిలోనో తపస్సులోనో నువ్వుంటావ్
అదృశ్య అధీనంలో ఆధార అశ్రువై
మూగ ముఖంతో కనిస్పిస్తావంతే
ఇరుకిరుకు ఇంద్రియాల ఇంద్రజాలం
ఓ విన్యాస విధ్వంసం
మరో ఇమడని పగటిలో
పొలమారిన ఊహలు
ఎవరూ ఉండని అద్దంలో
ఎవర్ని వెతుకుతావ్
చీకటి చేతుల్తోనే తెరవాలి
కిటికీనైనా, గాలినైనా
3 comments:
'ఇరుకిరుకు ఇంద్రియాల ఇంద్రజాలం' బాగుంది నాయుడూ, స్ట్రక్చర్ ను ఉండనిచ్చావు ఈ పద్యంలో నీకిది అనూజువల్, కదూ?! :-)
thank you HRK sir.
one of your best poems naidooo-raa reddy
Post a Comment