అటు ఏదో ఉందనుకున్ననా
ఇటు ఏదీ లేదనుకున్నానా
ఇవేవీ కాదని ఏమిటేమిటో అనుకుంటున్నానా
పూర్తిగా ఇది అవ్వదు అని తెలుసునా
అది పూరించని పూరించిన ఖాళీ వాక్యమేనని
మరి అప్పటికీ
అప్పటికే నవ్వినా ఏడ్చినా మిగలలేని ఖాళీ అక్షరాలూ ఎక్కడుంటాయి
చేతులులేని అద్దాల్లోనా
అద్దాల్లో విరిగిన ముఖాల్లోనా
బోడి ముడులో
బొడ్డు ముడులో
బోర్లా జీవితంలో
కొన్ని అగ్ని నాశనాలు
చివరే లేక
ఇక ఏవీ లేనేలేని ఓ బొట్టు ఖాళీ వర్తమానం తప్ప
2 comments:
WOW. Finally You seem to find language which matches your thoughts.Some Poems are making more sense.
Oh sorry. may be your thoughts match your language in this context. Hence we have an impedance match. How ever this is a good poem.
Post a Comment