ఏది రాసినా మాటవ్వదు
మాటలతో ఆలోచించే మాటలు
నావద్ద లేవు
వొట్టి విడిచిపెట్టిన అక్షరాల్ని
కలిపి మాటల్ని చేయలేను
ముడుచుకుపోయే వాక్యాల్లో ఎన్నో ముడతల ముసుగులు
ఎంత తొలిచినా కనిపించని ఆలోచనలు
వింటున్నా ప్రతి చీకటిని
ప్రతి చీకటీ అద్దంలోకి చూడాలనే
ధన్యురాలు
శ్వాసించని పుష్పం
నీకు నేను తెలియదు
తెలియని నీకై నేను అని ఎప్పటికీ అద్దం అనదు
వెక్కిరింపు రక్తమే
వ్యాకరణ అనుమతి
ఉబ్బుతుండే నిశ్శబ్దం
చిల్లుల నీడై
గోడలన్నీ లోలోపలికి ముడుచుకుపోతూ
ప్రాంతాలన్నీ లోలోపలి బైటికి తెగిపడుతూ
ప్రతి అనుభవం ఓ ఖాళీ ప్రతిధ్వని
~~~
వివిధ, ఆంధ్రజ్యోతి, 09/01/2012
10 comments:
నిద్రపొయిందామ్మా? ఎందుకమ్మా? కాపలా కాయాలి, నీతో ఆడుకోవాలి, నిన్ను కరవాలి లేదా మమ్మల్ని కరవాలి కానీ పడుకోవటమేమిటమ్మా? చిలిపి. పోనీలే దానినన్నా పడుకోనీ పాపం.నువ్వు మమ్మల్ని ఎలాగూ పడుకోనివ్వవు. :-)
Anon. Thank you.
..వింటున్నా ప్రతి చీకటిని
ప్రతి చీకటీ అద్దంలోకి చూడాలనే..
"నా లోపలి కుక్క నిద్రపోయింది" అన్న ఈ కవిత ఆంధ్రజ్యోతి వివిధలో రావడం మనందరికీ గర్వకారణం.
మన అందరికీ అనగా కుక్కలకా, లోపల కుక్కలు నిదురపోతున్న మనలకా, కుక్కలలో నిదురపోయే మనకా, మనవైన కుక్కలకా, మనవి కాని మనవి చేయలేని కుక్కలకా, కుక్కలు కాలేని మనకా, కుక్కలుగా లేని కుక్కలకా ఎవరికీ మానవా? (మానను)
hi Anon's and Veera bobbili. thank you
భౌ భౌ వౌఊఊఊఊఊఊఊఊ
మన లోపలి కుక్క లేచి మొరుగుతున్నది..
"ప్రతి అనుభవం ఓ ఖాళీ ప్రతిధ్వని"..... అని కవి స్వానుభవపూర్వకంగా చెప్పిన తర్వాత, కామెంట్ చేయడానికి పూనుకోవడమంటే, కవిత చదివాక మేలుకున్న లోలోపలి వాక్యాల్ని నిద్ర పుచ్చడమే.
Great Poem Naidu...Thank u...
Thank u Naresh and other Anons
Post a Comment