గదిలో దీపాలు ఆర్పేసాక
దేహాలలో దీపాలు వెలిగించక
మౌనదీపాల్ని వొడుకుతుంటాను
రోడ్లపై దొర్లిన నాలుకల్ని మోసుకొస్తాను
లెక్కలేనన్ని అక్షరాల చిక్కుముడుల్ని సరిచేయాలని
ఖాళీ దీపాలు ఈ నాలుకలు
దేహాలలో దీపాలు వెలిగించక
మౌనదీపాల్ని వొడుకుతుంటాను
రోడ్లపై దొర్లిన నాలుకల్ని మోసుకొస్తాను
లెక్కలేనన్ని అక్షరాల చిక్కుముడుల్ని సరిచేయాలని
ఖాళీ దీపాలు ఈ నాలుకలు
3 comments:
నాతో నేను మాట్లాడినట్లుగా
మీతో చెప్తుంటాను
నీళ్ళు వెనక్కి తన్నినట్లు
నాకే వినిపిస్తున్న దారిలేని మాటలు
ఒణుకుతున్నవేళ్ళతో
మీ చేతుల్ని స్పృసిస్తాను
చల్లని శరీరం నాదే తగులుతుంది
ఏ కన్నీళ్ళూ దరి చేరవు
తడబడే అడుగుల్ని
దారంలోకి కూర్చాలని చూస్తే
ఎంత వెదికినా దొరకని సూది
మోయలేని భారమేదో దారితప్పుతూ
wow short and sweet.
thank you padmaarpita gaaru, and anonymous gaaru.
Post a Comment