గుమ్మానికి యే వైపునే
రాత్రి తిరుగుతోంది
కలే కుదురుకోదు
మోయలేని భావం
భాష కాలేదెన్నడూ
ఊహించిన ఆలోచనే
ఉపన్యాస సన్యాసంలో
సీతాకోకచిలుక మొరుగుతోంది
తూనీగ గాండ్రిస్తోంది
దేహాంతాల్ని దర్శించే
దుర్భల అక్షరాలు
ఏ సమాధానమూ వినపడదు
ప్రేక్షకుడా
తోలులేని తెర దిగింది
శ్వాసకుడా
వెనువెంటనే తిరిగి చూడకు
కదలని చిత్రాలే నిద్రలో
యింకా వొదలదు గుమ్మం
No comments:
Post a Comment