Blog Archive

Followers

Thursday, October 12, 2017

నీలం

చెరిపేసేయ్
చేరి రాసే కళ్ళని, వొళ్ళునీ
చప్పరించు అక్షరాల్ని
మరణాల్నీ
చర్మేంద్రియాల్ని,
ధర్మేంద్రియాల్నీ
నాకు
చరాచర చితితో
చరచరా
తప్పించుకునే తడబాటుల గాలి
తడి బాటలే లేని జీవితం
జన్మించే హృదయం లేదిపుడు
వీక్షించే మౌనం వేధించదు
మోసం చేసేయ్
దరికి రాని ప్రేమతో
ఒకానొక ప్రేమి
విధేయ రాహిత్యంతో జీవించి

No comments: