Followers

Monday, March 29, 2021

||  దొరకని తలుపు ||

పదం ఎగిరిపోతోంది. ఎగరని ఖననం. ఎందుకో ఎవరో చుాసిన నిశ్శబ్దం. అప్పనంగా. అర్థనగ్నంగా. అక్షరాలన్నీ సంపూర్ణ


నగ్న అక్షరాలేనా. శరీరానికే అక్షరం. తొడుగు. తొడుగు. తొడలే లేని రాత్రి. గదిలో, ప్రేమతో విలపించకు. అదో విషం. అదో నిష. తత్వవేత్త వెలిగించే మాటలు మూర్ఖంగా కనిపించలేదా.

ఎన్ని చెవులు నీలో.


ఎన్ని నాలుకలు నీలో.

దారితప్పి

వొచ్చిన ఇంద్రియాలతో


నువ్వే శరీరాన్ని వెతుకుతూ ఉంటావ్.

తలలూపే అక్షరాలమధ్యే ఇంకెంత కాలం


ముద్దుముద్దుగా ముద్దగా.

కాని సొంత రచన, ఓ సొంత


విసుసుసుసుసుసుసుగు మనసు. అంతకన్నా ఏ కంటి కలా లేదుదుదుదుదు. కొన్ని అక్షరాలు ఈ కాగితంపై కనిపించకపోతే చాలు.

కలలో ఉండని నిద్ర


నిద్రలో వుండని కలే కావాలి


చనిపోయే చీకటినే చుాడాలి.

రాదు. మరో మనసు.


ఒక మనసే. ఎన్ని అంగాలో. ఎవరి అంగాలో. అంగాంగాల మనసు. నీదే. కానే కాదు.

మరో రాత్రిలోకి, రాత్రే రాకపోతే, రాత్రే, ఎక్కడో. అదే దారం. అదే అద్దం. అదే పేగు. అదే ముఖం. అదే నిశ్శబ్దం కాదు. ఎన్నటికీ.

ఈ పదాల బయట


ఏదీ కనిపించదు. దాయాలి.

గాయాలని గుండెకి నేర్పాలి


కలలు తెరిచే కళ్ళతో

కోవిడ్ రాత్రి ఇంకా వుంది.

ధ్యానం, ధ్యాస


ఆలోచనల రొంపి కోసమేనా

.

No comments: