లొంగిపోతాం కొన్ని మాటలకే
మనకే తెలియని మనవే అయినా
అవి
చైత్రమాసపు కారు మబ్బుల్లోంచి వాలొచ్చు
నిరాశాజనకమైన కిటికీలోంచి రావొచ్చు
దాహార్తి నశించని ఆసుపత్రి గదుల్లోంచి వినవచ్చు
నిర్లజ్జ దుఃఖ శరీరాల్లోంచి బైటపడొచ్చు
పిల్లల కలవరింతల్లోంచి ఎగరొచ్చు
అప్రియమైన శాంతి వాక్యాల్లోంచి పాకొచ్చు
ఏ ఆఖరి నిద్రో సమీపించే ఆసందర్భంలో దూరొచ్చు
అన్ని అక్షర బంధనాల్నీ తిరస్కరించి చేరొచ్చు
ఓ నిరాశ్రయుడి పలవరింతల్లోంచి తప్పి గెంతొచ్చు
ఏదో ఒక నేత్ర రత్యానంతర జుగుప్సతో జారి పోవొచ్చు
కొన్ని మాటలు మనకీ కనిపించవు
ఇంకొన్ని మనల్ని ఉరితీస్తుంటాయి ఎల్లప్పుడూ
3 comments:
నాయుడు గారు మాటల్ని ఇవాళ ఎంతగా ఉరితీస్తే అంత మంచిది లేకుంటే అవి మనల్ని ఉరి తీస్తూనే ఉంటాయి. మీ కవిత్వం బాగుంది. ఇక రెగ్యులర్ గా మీ బ్లాగ్ చూస్తాను
arthamayyee kaanatlugaa vundi..
పద్యం చాల బాగుంది.
Post a Comment