కన్నీటి బొట్టుని చదవటానికి
నీ వద్దకు వొస్తాను
నువ్వు దాన్ని తీస్కొని
విసిరేస్తావు నా మనసు మారుమూలల్లో
వెతుక్కుంటాను కళ్ళ మధ్య
ఇంకేమైనా దొరుకుతాయేమోనని
నీ నుంచి మరలిపోవాలనిపించదు
కావాల్సింది ఏంటో అడగలేను
మనుషుల మీద ఇళ్లున్నాయి
ఇళ్ల మీద సమాధులున్నాయి
కళ్ళ కోసం సమాధులు లేవెక్కడా
దూరమౌదాం ఇపుడే
కన్నీళ్ల అడుగుల్తో
2 comments:
నాయుడు గారూ:
రోజూ మీ అక్షరాల పలవరింతలు...కలవరింతలు...తుళ్ళింతలు...కొంచెం గిచ్చడాలూ...కొంచెం కోపాలూ...అన్నీ తెలుస్తున్నాయి.
అక్కడ కాసింత కవిత్వ వాన కుండపోత అయ్యినట్టుంది. వానకీ వానకీ మధ్య తెరిపి అందంగా వుంటుందేమో!
కాస్త కుళ్ళుతో...
అఫ్సర్
"కన్నీటి బొట్టుని చదవడానికి నీ దగ్గరకి వస్తాను" బహుశా మీ బ్లాగుకి నేనందుకే వస్తానేమో!
మీ కవితలన్నీ చదువుతున్నాను. కన్నీటి తడి తగులుతునే ఉంది. కవిత చదవగానే కామెంటు పెడదామనుకుంటాను. కానీ ఏమి రాయాలో అర్ధమవదు. కన్నీటితో తడిసిన పగిలిన అద్దంలో వేనవేల ప్రతిబింబాలు. మీ కవితా శకలాలు.
తప్పక రాస్తూ ఉండండి.
Post a Comment