Blog Archive

Followers

Thursday, April 15, 2010

డాలీనందుకోలేక…

అనంత బాహ్యార్థ స్థిమిత సంజ్ఞల్లో
కలిసిపోయిన వేగుచుక్కలు

మెరిసే కొంగ రెక్కల్లో వ్యామోహార్తికి
నీలి గుర్రాల చప్పుల్లో
జారిన చినుకుల్లో వాన

అనేకానేక మూర్త భంగిమల్లో పేర్చుకున్న
గాలి కలలు తెగిపడుతున్నాయి
ఆధోజగత్తులో

కామోప్రేత స్ఖలనాలింగానాల చిట్ పట్ లు
చల్లగా కోస్తున్నాయి

రాల్తున్న శిరోజాల్లో అంటిన బంక ఇసుకని
తోసుకుంటూ అక్షరాలు

చనిపోయిన అస్తిత్వ ఎముకల్లో గూడుకట్టుకున్న
ఆలోచనలు ఇంకా వదలడం లేదు కళేబరాన్ని

బయటకొచ్చిన చూపు విసిగిపోయింది
దేహంతో

ఉండగా మారిపోతున్న ముఖంలో అద్దం
కపాలంగా కన్పడి కన్తడిలో ఎండి
పేడులా కూరుకుపోయింది భూమిలో

ఏక నేత్ర దృశ్యాల్లో అంతరంగ శబ్ద ప్రపంచం
రాగంలా విన్పడుతోంది గిటార్ నీడలో

క్షణాలు కరిగి అభౌతిక సెగలో కాలి
వ్రణ వ్రణాలుగా గడ్డకట్టి
వరసగా నీళ్ళల్లో ఈదిన ఆల్చిప్పలు
భయం భయంగా భూగర్భంలో నృత్యం చేసి
మసక మసక లేత చేప రెక్కలు
నిశ్శబ్ద భూమ్యాకాశ మధ్యలో సాగుతూ వేలాడి
పీచు పీచుగా నాచులో జాగ్రత్తగా
నడుస్తో హృదయావేశం

విసిరేసిన వక్షోజాలు జారుడుబల్లలో
ఆగిపోయి కలలు కంటున్నాయి

వ్యవహార నియంత్రణా జాగరణలో
మూర్తీభవించిన చీకటిలా శోక
శకలాలు పడ్తున్నాయి స్వప్నంలో

నోర్విరిచిన ఖాళీలో వానపాము ఆటలో
దిగబడిన బాటలో కూర్చున్న మాటలు
రంధ్రంధ్రానికీ మధ్య వెడల్పుగా నీడలు

1 comment:

Unknown said...

నాయుడుగారూ మీ కవితా సంకలనం దిండుకిందపెట్టుకొని రోజూ కొంచెం కొంచెం చదువుకుంటున్నాను.నాయుడు అసాంఘీకుడా అని మో రాసిన దగ్గరనుండి ఇది జరుగుతూ ఉంది.మొన్నీ మధ్య రఘోత్తం రెడ్డి మిమ్మల్ని కలిసినాడటగదా.ఆ సంగతులూ తెలిసినాయి.
మీకు వీలు పడితే నాతో మాట్లాదొచ్చు.నామైల్:nagarajuavvari@gmail.com