ఆ ముఖంలో రుచి కనిపించక
నాలుకతో నిర్మించిన నిర్లిప్త నిరీక్షణే
అప్పటి వో కాలపు సాయింత్రపు
సూర్యశబ్దాల ఆఖరి నిశ్శబ్దజిహ్వకై
స్వప్నాసనాలు నేర్పిస్తుంటే
యెప్పటి వూపిరి యెముకల్లోకో
పర్వత పాదాలు తడవటానికి
అనుసరించే ఆలోచనలు
క్షీణత
పక్షవాతపు క్షీణత
వాసనల క్షీణత
తాబేటి తలలో నీడల్లేని మాటల వంతెన
నేలను తాకే కల
గుడ్డి నవ్వు
కాయితాలే ఊపిరి పీలిస్తే అక్షరాల్లేని మాటలే పదాలవుతాయా ముక్కంటిపండులో ఏ సూర్యముఖమో ముగితి గోతికై అవికల ఆరోగ్యం రోబో గ్రంధులే అందరిలో అసుఖపుష్పాలే హృదయంలో ఏదీ నిరంతర శాశ్వత శ్వాస అసమాధానాలే కాయితాల కౌగిలంతలో
ఆపాలనుకున్న ఏదీ కాదు అంతం ఆగటం అగత్యం గతం అనంతం ఆకర్షించే అహం స్పృహ ఆహ్వానించదనేకదా ఇంత బాధా!
#
కొండ చివరన పాదం కొన మోపినప్పుడు కాసిన నీ వొక్కడిదీ వొంటరి కాదు చూపు నీ పాదం ఇంకా కానని లోయ వైశాలి కనుగొన్నదేదీ కన్నుదే కాదు చూపు విస్తరి
#
దృశ్య దేహాలు మరుగున పడనీ దేహాతీత దృగ్విషయాలే మక్కువ వలయాలు దరహాస హోమం ముందు మృదుమాస గాయం సోయ హొయలు అనిర్జీవమ్ ఎక్కడిదయినా సరే ఓ రాత్రిని ఈ రాతిరికి కొన్ని కలల సేదకు అక్కున కునారిల్లనీయ్
#
బరువు జీవితం అరువు కాగితం సిరా కరిగే కడలి వీపున శిలువే తీరం మనో ఏకాంతరం నడుమ మరో ద్వీపాంతర వాసాలు దిక్కు దీపం ఆర్పినా దరి దారి కాలిని కననీయ్
#
స్నేక్స్ సాక్స్ విడిచినా విషం సశేషం తేలియాడే ఆడ ఆట అవాక్యం
అమాటలేగా మిగిలేవీ అకలలేగా మసిలేదీ
కని కరించని సత్యాలనే కఠోరంగా అను సరించాలి
#
ఆ పిర్ర నునుపు వంకరే ఆ పిట్ట మనసు ముక్కెరే ఎరిగే ఎగిరే నిశ్శబ్ద దహన కాంక్షా వృత్తాల్లో ఇటు విరిగి ఒరిగాం అంతే
అతి ప్రాతః మృత్యు కారాగారంలో సరికొత్త ప్రాణ వాయువు
అధరం మాటున అచిత్రం దేహ భాష వంచన ముఖచిత్రం చేరాల్సిన రాల్చిన పగల్చిన అద్దాల్లో అదాహ ఆకృతి
పిల్లల పిలుపెక్కడ? పిలుపులోని పిల్లలెక్కడ?
తోడు దిగులుగా నీడ మిగులుగా ఈ రాత్రి ఈ చెట్టు గర్భవతి
పిల్లలే ఏ అనుమతీ అక్కర్లేని రెక్కలల్లార్చిన పిట్టలు
#
తిరగుతున్ననేలపైన వాలలేని వానలే ఆనవాలై దేహాలు ఆరబెట్టుకుంటున్న మేఘాలు చడీ చప్పుడూ లేని మౌనాలోచనాలు ఎప్పటికప్పుడు తలతిప్పేసుకునే రక్త పాతరలు
#
వృక్ష వక్షోజాలపైనా కుదురు ఎరుక రాకపోతే చుట్టూ కల తిరుగు కనీసం ఏదో మొక్కు వున్నట్టు ముక్కలు ముక్కలుగా మొక్కలు మొక్కలుగా పగిలి విత్తులా నిప్పుకు పుట్టిల్లే విత్తు వళ్ళు కను
#
మరో వాలు తిరిగిన ఆకాశాన్ని మరో చినుకు అడిగింది పాదముద్ర
దరి చేరే గాలి కలలో సకాలం ఎవరిది? విసర్జించని అక్షరాల్లో మౌనం ఎవరిది?
మరో గాలం జాలరి జీవితం జారే వలే చేప కలల కడలి
------------------ అనంతు ఎం. ఎస్. నాయుడు అక్టోబర్ ఇరవై రెండు. పన్నెండు