నీ బయట
రాత్రి ఎదురుచూస్తోంది
నిలకడలేని నీడలనీ
కడలి ఒడిలో దాచే పౌర్ణమి
చెట్లపై చీకటి కొమ్మలకీ తెలుసు
చీకటి నీటిలోని చీకటే నీరుకి తెలుసా
వినిపించే నీ బయట
రాత్రి ఎదురుచూస్తోంది
నీ లోపల పెరుగుతోంది
ఒక సన్నటి ఖాళీ పుష్పం
అందుకోవు
తెంపుకోలేవు
తలిదండ్రులులేని స్వప్నాలు
నీ బయట ఎదురుచూస్తున్నాయి
ప్రతిధ్వని ధ్వనినే వినాలనుకున్నావా
ప్రతిబింబ బింబాన్నే చూడాలనుకున్నావా
అదృశ్యమయ్యే
దృశ్యం నీ బయట ఎదురుచూస్తోంది
వెళ్ళావా
5 comments:
mee email ID ivvandi!
kavitha gurinchi malli rastanu.
mee email ID ivvandi!
kavitha gurinchi malli rastanu.
naaidu@gmail.com
Mr Naidu,
You have good expression to forge images and play with words. But then, this is abstract poetry. Like what Tilak said, the obscurity of poetry should be translucent so that reader should be able to catch at it with some effort. Otherwise, all your endeavor would come to naught. I know there would always be a reader for poetry in the space-time continuum. But then, there is pleasure in sharing poetic experience with your reader in the present.
Once again, you have fine diction and can play with your words. Sincere congrats.
Best regards,
NS Murty
thank you murty garu.
Post a Comment