అన్ని ఆలోచనలు అంతమయ్యాక
కొన్నే పదాలతో ఆలోచనల్ని రమ్మంటాను
వొస్తాయో రావో ఎవరికి తెలుస్తుంది
అందమైనవి అందంగా ఎపుడూ లేవు
అరుదైనవి అందంగానూ లేవు
అర్థమవ్వనివీ అందంగా లేవెందుకో
సొంతమయ్యే ప్రతిదీ ఎంతో బాధపెడతాయి
బాధపెట్టే ప్రతిదీ ఎప్పటికీ సొంతమవ్వదు
బాధించేవే అన్నీనూ
అన్ని మాటలూ అంతమయ్యాక
కొన్ని ఆలోచనలు మరికొన్నై
పదాల్ని పిట్టల్ని చేసి ఎగరేస్తున్నాయి
ఎవరి రెక్కలో
ఎవరి ఆకాశామో
ఎవరికి తెలియచెప్పాలి
3 comments:
one of your bests...
hi ajay. thank you.
i don't know it's ranking but it was written.
hi naidu...its not about ranking..i mean one among bests
Post a Comment