// ఏది సత్యమో అది జ్ఞానానికి బహు దూరం
నేత్రాలూ సమాధులే
సౌందర్యం బాహ్య అంతర్మధనం
ఏది అసత్యమో అది నిజమా
ప్రవహించే శోకంలో ఈదటమో మునగటమో
తన నిద్రని తానెప్పుడు చూసుకుంటాడు
ఒంటరి ఆకాశంలో ఒంటరి సముద్రం
అద్దంలో ఎవర్నీ చూడకపోతేనే అర్థం
ఖాళీ నేత్రమో, జిహ్వో, అధరమో ఎప్పటికీ ఆధారాలు కాలేవు
ఓ ముసలి పసి దుఃఖం సంభాషించే జ్ఞాపకమే
అందరిలో ఓ మరలిపోయే దూరం అతి దగ్గరగా
పుట్టినరోజులో తారీఖు లేదు
నిండు పుండు చావు
బతికే ఉన్న కళ్ళ వెనకే కన్నీళ్లు లేవు
మరణమే సూర్యుడి ఊపిరి
శాంత శిశ్న శివ స్మశానం
హృదయం నిర్గుణం
సమరం సమయం
సంఘంలో ప్రతి దృశ్యం శూన్య శత్రువు
ఊరించే ప్రతిదీ ఊరదు ఎప్పటికీ
ఊపిరిలో గాలి ఎవర్ని చూసింది
వెదురు నేత్రంలో శూన్య స్ప్రహ స్పర్శ మోక్షం
అనామక ఆకృతి అదృశ్యంలో
దృశ్యంలో నేత్రం ఎప్పటికీ లేదు
ముఖమే మారణహోమం
బాల్యం ఎక్కడో, మరెక్కడో ఎప్పటికీ కనిపించదు
తలుపుల్లోకి తపస్సు చేయలేని తలపుల నిశ్శబ్దం
పూలపై నిద్రించే దేహం రేపటికి లేదు //
నేత్రాలూ సమాధులే
సౌందర్యం బాహ్య అంతర్మధనం
ఏది అసత్యమో అది నిజమా
ప్రవహించే శోకంలో ఈదటమో మునగటమో
తన నిద్రని తానెప్పుడు చూసుకుంటాడు
ఒంటరి ఆకాశంలో ఒంటరి సముద్రం
అద్దంలో ఎవర్నీ చూడకపోతేనే అర్థం
ఖాళీ నేత్రమో, జిహ్వో, అధరమో ఎప్పటికీ ఆధారాలు కాలేవు
ఓ ముసలి పసి దుఃఖం సంభాషించే జ్ఞాపకమే
అందరిలో ఓ మరలిపోయే దూరం అతి దగ్గరగా
పుట్టినరోజులో తారీఖు లేదు
నిండు పుండు చావు
బతికే ఉన్న కళ్ళ వెనకే కన్నీళ్లు లేవు
మరణమే సూర్యుడి ఊపిరి
శాంత శిశ్న శివ స్మశానం
హృదయం నిర్గుణం
సమరం సమయం
సంఘంలో ప్రతి దృశ్యం శూన్య శత్రువు
ఊరించే ప్రతిదీ ఊరదు ఎప్పటికీ
ఊపిరిలో గాలి ఎవర్ని చూసింది
వెదురు నేత్రంలో శూన్య స్ప్రహ స్పర్శ మోక్షం
అనామక ఆకృతి అదృశ్యంలో
దృశ్యంలో నేత్రం ఎప్పటికీ లేదు
ముఖమే మారణహోమం
బాల్యం ఎక్కడో, మరెక్కడో ఎప్పటికీ కనిపించదు
తలుపుల్లోకి తపస్సు చేయలేని తలపుల నిశ్శబ్దం
పూలపై నిద్రించే దేహం రేపటికి లేదు //
5 comments:
wonderful!! అప్పుడప్పుడూ ఖడ్గాన్నిలా ఝుళిపించు..
అద్దంలో ఎవర్నీ చూడకపోతేనే అర్థం
ఇది ఎక్కడో లోతుల్లో తాకుతోంది..
thank you bvvji and anonji
naidu garu , its a nice poem . some sentences are very connecting like...
1. ఏది సత్యమో అది జ్ఞానానికి బహు దూరం
2. ప్రవహించే శోకంలో ఈదటమో మునగటమో
తన నిద్రని తానెప్పుడు చూసుకుంటాడు
3. అద్దంలో ఎవర్నీ చూడకపోతేనే అర్థం
4. బాల్యం ఎక్కడో, మరెక్కడో ఎప్పటికీ కనిపించదు
hi ganga reddy. thank you.
Post a Comment