మరణించాలనే ప్రతి అల ఒడ్డుకి చేరితే
ఎవరో బతకమని బలవంతంగా వెనక్కి లాక్కెలతారు
ఎప్పటిదో ఓ రాత్రి తన రాత్రిని అసహ్యించుకుంటుంది
కాలాన్ని అపహాస్యం చేయాలనేనా మృత్యువు రోదిస్తోంది
జరామరణాల మధ్య విరామం ఎంతో ఎవర్ని అడగాలి
అద్దంలోపల్లున్న మట్టిలో ఆడుకుంటున్నాను
వొంగిపోయానో లొంగిపోయానో ఇంకా దాగున్నానో
పరమపదించే పదమేలేని నిద్రలో ఆడుతున్నానో
గుండెల్లో ముళ్ళు పెరుగుతున్నాయి
కన్నీళ్లు గుచ్చుకునే మెత్తటి కొండలు
స్పర్శ స్పృహ
ఎంత ద్రోహం
ఎంత జ్ఞానం
విడిచిపెట్టే ప్రతిదీ అదృష్ట అదృశ్యం
జ్ఞాపకం చేయకు ప్రయాణించాలని
సమాధి ఎదురుచూస్తోంది
2 comments:
మరణించాలనే ప్రతి అల ఒడ్డుకి చేరితే
ఎవరో బతకమని బలవంతంగా వెనక్కి లాక్కెలతారు
పరమపదించే పదమేలేని నిద్రలో ఆడుతున్నానో !!
మీ పదచిత్రాలు అబ్బురపరుస్తాయి నాయుడు గారూ. తప్పక రాస్తూ ఉండండి.
hi subboo. thank you. let me try.
Post a Comment