కావలించుకున్న కవల కళ్ళల్లోని
కౌగిలింతంతా వృధానే
కూర్చున్న రోగి చీకటికి
నీకు, నాకు మాటలు ఎక్కడ్నుంచి వొస్తాయి
సంచరించే గర్భసంతోషం ఎవరిది
నవ్వటానికి ఒప్పందాలు ఎక్కడ
భయపడే చావు
చావుకి భయపడే మనం
శూన్య శోకం
శోకవిశ్రాంతి
ఆకాశం ఆకాశమే
సూర్యుడే సూర్యుడు కాదు
చెవులు బాధపడ్డాయి
బాగుపడ్డ కొన్ని కళ్ళని చూపించు
అద్దంలోపల సముద్ర కెరటాలు
ఈ రోజు అద్దాన్ని చూళ్ళేదు
౦ జీరో ౦ జీరో
నా చూపంతా
మాట్లాడు ౦ ౦ ౦లతో
3 comments:
నవ్వటానికి ఒప్పందాలు ఎక్కడ/ భయపడే చావు- చావుకు భయపడే మనం / అద్దం లోపల సముద్ర కెరటాలు - ఈరోజు అద్దాన్ని చూడలేదు. (ఇది చదివి నాకు దిగులో విషాదమో కలిగింది)
తెలుగు భాషకు కొత్త అక్షరాలివి. ఎవరు చదువుతారు? ఉత్త బాగుందంటే ఏం బాగుంటుంది? పంచేంద్రియాలు గతితప్పిన లయలో రాయడానికేం ఉంటుంది? అనుభవించి, ఆశ్చర్యపడి, తేరుకోలేక, దారితప్పి, చూపు చిక్కుకుని, మాటపడిపోయి, నిశ్శబ్దమో, సముద్రమో ఎదైనా భాషకందని భావం కలిగే కవిత్వమిది. నీ వేళ్ళమధ్య జంత్ర వాయుద్యమేదో ఉన్నది. అక్షరాలనే ఆశ్చర్యపరిచే మంత్రదండమేదో నీదగ్గర ఉన్నది. నిద్రలోంచో, నిశ్శబ్దంలోంచో, ఢీకొట్టే క్షణాల శూన్యంలోంచో లేక విస్ఫోటనమయ్యే కణాల మధ్యనుంచో చూపునో, శబ్దాన్నో ఉన్నదిలేనట్లుగానో లేనిది ఉన్నట్లుగానో ఒడిసిపట్టే పరుసవేదేదో నీ దగ్గర ఉన్నది. నువ్వు మాత్రమే చెప్పగల కవిత్వం నీకొకటి ఉంది. నీ ఆల్కెమి నీకుంది. నీవొక అరుదైన వాగ్గేయకారుడివి. అక్షరాలు లేని నీ పదాలు ఎంత అందమైనవో అంతకు మించి కఠిన కోమలమైంది నీ కవిత్వ తత్వం.
poem baagundi
hi anonymous. Thank u for u r lengthy appreciation. I am not that worthy to take u r loving sentences. i am trying and learning to write a poem. i haven't become a poet.
Post a Comment