ఇదొక వేళ అని మాత్రమే తెలుసు
సమయాలు ఎవరో చూసుకుంటారు
ఎవరికీ ఎవరూ చెప్పలేరు చెప్పుకోలేరు ఈ స్థలంలోనే బతికున్నామని
ఒక ఆదివారమో, ఒక దినవారమో
దేహంతపువారమో, సదా రాత్రివారమో
గడిపేది బతికుంటేనే
వర్షమో సూర్యుడో
తడతారు స్త్రీకీ లేనటువంటి చేతులతో
గాలే ఆగుతుంది కళ్ళల్లో
ఖాళీ జిహ్వాలో
ఖాళీ నేత్రంలో
ఖాళీ మనసులో
ఎన్ని మాటలున్నా నన్ను చేరవు
వాసనో యాతనో
నీటిని తవ్వే దేహంలో
నిప్పుని పూడ్చే శవంలో
చేరుకోవాలి
చేదుకోవాలి
చనిపోకముందే బతకలేని క్షణాల్ని
చెట్లు నడిచే తోవలో
కొండలు పరిగెత్తే రహదారిలో
సముద్రాలు గెంతే గగనంలో
నేనూ నా ఆఖరి వాక్యం
సేదతీర్తాం
మమ్మల్ని కదపకండి
మరో వాక్యాన్ని రాస్తున్నప్పుడు
7 comments:
"వాసనో యాతనో నీటిని తవ్వే దేహంలో నిప్పుని పూడ్చే శవంలో చేరుకోవాలి చేదుకోవాలి చనిపోకముందే బతకలేని క్షణాల్ని"............ చక్కటి పద ప్రయోగం.. అంతకుమించీ హృద్యంగా, కదిలించేలా కవిత... చాలా బాగుంది సర్...
Shobha Raju 11:57am Aug 12
"వాసనో యాతనో
నీటిని తవ్వే దేహంలో
నిప్పుని పూడ్చే శవంలో
చేరుకోవాలి
చేదుకోవాలి
చనిపోకముందే బతకలేని క్షణాల్ని"............ చక్కటి పద ప్రయోగం.. అంతకుమించీ హృద్యంగా, కదిలించేలా కవిత... చాలా బాగుంది సర్...
కవిత బాగుంది నాయుడూ.
vaakymavaham mukyam...m.s.naidu is asset to TELUGU POETRY>>
Thank you Shobha Raju garu, Yakoobji and anonymous ji.
తెలుగు కవితకు దొరికిన సూరీడు మా 'నాయుడూ! ఎన్నాళ్ళయింది నీ పొయెట్రీ చదివి! మైండ్ ఫ్రెష్ అయిపోయింది!
Phanigaru. Thank u. But i won't agree with your appreciation.
Excellent Poem!!
Post a Comment