ఈ పదం మరో పదానికి ఆహ్వానం పలకదు.
పారిపోయే పాదాలు పాకుడు వాసన పట్టి,
రెప్పపాటులో ఒక రంగుల నీడ అవ్వొచ్చు.
లేదంటే, దగ్గరికొచ్చే సుతిమెత్తని అలై
గుండెల్లో పెలుసుబారిన ఆకై విరిగిపోవొచ్చు.
లేకుంటే, ఆకాశం లోపించిన పిట్టై,
నిద్రటాకులో ఎగరావొచ్చు.
అదేదీ కాకుంటే, ఈ కంటికి కొన్ని చినుకులు అడ్డంపడి,
నీడల గడ్డలు పెరగావొచ్చు.
ఏదీ కాకుంటే, ఈ వాక్యం చివర
మరో పదం ఉండదని తెలియక పోవొచ్చు.
లేదంటే, ఇవేవో పదాల మధ్య మసిలే
చీకటి వాసన అవ్వొచ్చు.
2 comments:
Sir,
I cld nt understand anyth..
బెల్లం పక్కన చిమల్లానో
పూతోటలో తుమ్మెదల్లానో
మురుగు గుంటపై దోమల్లానో
భావాన్ని అనుభూతిని పట్టి
పదాలు కుప్పగా రాలుతుంటాయి
గొడుగు పరిచి తప్పుకోనూ వచ్చు.
దోసిట్లో నింపి మురిసిపోనూ వచ్చు.
ఒక పదం మరోపదానికి ఆహ్వానం పంపదు
మొదటి పదాన్ని తప్పకుండా అనుసరిస్తుంది.
నాయుడు గారు చాలా బాగా రాశారు. మంచి కవిత. అభినందనలు.
Post a Comment