తుడిచేసుకోవాలి తడిలేని తలపులని తలుపుల్ని తడి అంటకుండా అంటేమో అంటాము అనుకుంటాము ఆనిందాచాలి కదా నిష్ఫల ఛాయల్లో ఓ ప్రేమ వాక్యం మోసం చేసి చూడాలి సులోచనా దర్పనరహస్యం ఓ చిరగని పదం అపరాధ మాత్రలేవో మింగుతుంటే స్వాధీన మాటలే మాటలపై మాటలై మాట్లాడవు దాటెల్లే మనసు మౌనంతో ఎందుకీ సంభాషణ కొండల్లోని మేఘాలు నిన్నే చూస్తాయా గత రాత్రిలో లేను నేను అలా ఉన్నా ఉన్నాని ఉన్నానో తెలియదు ఉపేక్షించే ఊహల్లో ఊహాజనితం జన్మ ఘనీభూత అస్తిత్వం పరోక్షమే నిశ్చల వ్యసన చలనం మెలితిప్పే మౌనం ఏ నేత్రంలోనో
జరాస జర్దా జల్దీ జిందగీలో. బాబా రత్న రంగుని పులుముకుంటూ నములుకుంటూ. తేలు కొండెం చీకటిలోకి ఆలోచనలు లేని ఆలోచనలలోకి. మనసుని గోక్కుంటూ.
2. బర్వుగా తేలిపోతాం.
ఏ ఊరెళ్ళావో ఎవరికీ చెప్పకే. tabula rasa. తబలా తలల జ్ఞాపకాలు, హార్మోనియం నేర్చుకోవటాలు, బొమ్మలు గీయటాలు, spells of tranquilityని పట్టుకోవటాలు తేలిపోయిందెక్కడకో. యిపుడెవరికి కాపలా యీ వుత్తరాలూన్నూ. ఎవరికైనా చెప్పి తిరిగొచ్చేయ్ మొగల్ సరాయ్ లో కలుసుకుందాం. ఓ గోధుమ రంగు స్నేహంలో. గో. గో. ఇళ్ల కప్పుల్నీ, కప్పల్నీ, కాళ్లనీ, కన్నీళ్ళనీ, కాకి ఇంద్రధనుస్సుల్నీ విడిచి. ఇడిచి.
3. బర్వుగా నానిపోతాం.
నాన్న కొట్టారా. భార్య చనిపోదెప్పటికీ. అమ్మే మిగిలి. మిగిలి. నాన్నే రగిలి. పగిలి. గిలి గిలి సిల్లీ చలి. గిల్టీ గాలిబ్ ల లబ్ డబ్ లు యిక వినిపించవులే. రబ్బరు రెక్కల రక్తం తొంగిచూడదులే. రేపటి గురకలు గుర్రమెక్కాయా. వలస కలవరింతలే కనికరించాయా. అసలు పక్షులు యెగురుతాయా.
4. బర్వుగా కాలిపోతాం.
నలుపు మంచు ఉరుముల ఊపిరిలో. ఎప్పటి రాత్రైనా వొహప్పటి జ్ఞాపకమేనా. దీపానికి తెలుసా సమయమెంతైందని. దేహానికి తెలుసా మరణమెంతైందని. ఆర్పు. ఆర్పు. నిద్రనదిలో మరుగుతున్న మంటల్ని.
5. బర్వుగా చూస్తుంటాం.
గది లోపలి లోపలి గదిలో గది గది గది లోపల లోపల లోపల గదిలో. కాళ్ళీడుస్తూ చూపులు. వొళ్లు విరగ్గొట్టుకుంటూ చూపులు. cosmic consciousnessలోకి 'నన్ను'ని వెతుక్కోవాలని చూస్తూ స్తూచూ చూస్తూ స్తూచూ వెళ్ళావా. నీ లోపలి గాలిలోకి. వీధిలోకి.
6. బర్వుగా గడ్డకడతాం.
' ఊదా నీలి జాలి - / "నిబద్ధతే" ఇదంతా ' అంటూ నన్ను నడుస్తున్న నీడల్తో, తాటిచెట్టంత రంగులతో నడుస్తున్నప్పుడు, ఎవరో నన్ను పీక బిగించిన నాలుకతో, నాలుకంత పీకని బిగించిన చీకటిలో గడ్డకట్టలేదూ. 'కోరతనపు అమాయకత్వం తెరలతో కప్పబడిన వికటాట్టహాసంలాగా, తలనరకబడిన కొబ్బరి బొండాంలాగా, మాసిపోయిన మొన్నలాగా,' ఓ వెర్రినవ్వు గడ్డకట్టలేదూ.
7. బర్వుగా ఖలరవుదాం.
' గోళీసోడా కొట్టినపుడు ఖయ్యిమంటూ మొదలుపెట్టి కీచుమంటూ దిగిన శబ్దపు ఖలరుందే, ఆ ఖలరండీ... ఒక నయంకాని ఏకాంతంలోకి... అంతటి అర్థరాత్రిలోనూ దూరంగా ఒక మిత్రుణ్ణి కలుసుకోవాలని ఉంటుంది అతనెలా ఉన్నాడో కనుక్కుందామని... ఆ ఖలరండీ... ఇంతకీ, ఆ ఖలర్లోని వేడి, వెలుతురు సరిపడ్డాయా?
వినిపించదు గాలి అలల నిశ్శబ్దం నక్షత్రాలు చెవులు రిక్కించనా ఖాళీవాయువే తనువు తీరాన్ని తట్టిపోగలదు మాటలు రెట్టించినా యింకా మెలిపెట్టే పదాల్తోనే నీ ముఖం ఎందుకు కనిపిస్తోంది పంజరాల పంజా మాటలు నీ ముఖంలో వేనవేల నోర్లతో నవ్వుతోంది వాననీడల ఊడల సుహంలో యే వూయలో నీ అడవిలో రాత్రీ నీ నీడ పొడవులో నేనో మరుగుజ్జుని స్వప్నదుఃఖాలు నీ అడుగులేనా నీ చేతులతో నా రాత్రిని తిరిగిచ్చెయ్ వినని మాటలలో నీ పెదాలపదాలు లేనివి ఎన్ని నీలో గాలి బావిని తోడుకో