ఎన్నో సాయంత్రాలు సూర్యుడికి
ఏ ఒక్క సాయంత్రమో నీ దగ్గర
పలకలేని మాటల నిశ్శబ్దంలో ఆకాశం
మేఘాలే కొండలపై , కొండల కాళ్ళపై పడి అలిగి వెళుతున్నాయి
ఎప్పటికైనా ఒక నదిని దాటి వెళ్ళే చంద్రుడ్ని చూడాలి
చిక్కిపోయో చిక్కుకుపోయో ఉండే ముఖం చూడాలి
ఆగాలేమో
లేచివుల్ల ముత్యపు చినుకుల పర్వతాల్ని చూడాలంటే
నీటి విరూపాల్ని దాటే ద్వారాల్ని తాకాలంటే
రహస్య పదాల మౌనంలో సంభాషించాలంటే
ఎక్కడా ఇటువంటి సాయంత్రాలని కోరుకోకు
ఎక్కడైనా నీ సాయంత్రాలు నీకై ఉంటే
నీ ప్రేమల్ని కాస్తంత గురుతు చేసుకో
నీ జ్ఞాపకాల్ని కాస్తంత ప్రేమగా గురుతు చేసుకో
నీ గడిచిన దినాల్ని మరీ ఇబ్బంది పెట్టకు
అవి ఎవరికీ చెంది వుండవు
ఏ సాయంత్రమో
నీ దగ్గర
ఒక అనామక రాత్రి నీకు తోడువుంటే
నీ
రాత్రి నీకు ఉన్నట్టు
కాదూ
ప్రేమకి
రాత్రులతో పని ఏమిటి
కొన్ని సూర్యోదయాలు
మరికొన్ని సాయంత్రాలు కావాలి
3 comments:
ఎప్పటికైనా ఒక నదిని దాటి వెళ్ళే చంద్రుడ్ని చూడాలి!
-నది ఎండి పోవచ్చు
చంద్రుడు చెదిరి పోవచ్చు
కానీ కవి కల మాత్రం కవి పోయినా ఆరిపోని జీవకళికే మిత్రమా !
మీ కవిత బాగుంది !
సర్ ,కవిత చాలా బాగుంది .
thank u .
Post a Comment