Blog Archive

Followers

Friday, November 12, 2010

హాఫ్లాంగ్ కవితలు

మేఘాల రవిక
ఈ నీలి కొండలపై.
ఆకాశం తొంగిచూస్తోంది

--
చంద్రుడి అడవిలో
దారులన్నీ జలపాతాలే.
ఒంటరి చీకటికి దారి ఏది.

--
ముఖాలు లేని మేఘాలు
ఎక్కడున్నా దీవిస్తాయి
అర్హత ఎవరికి కావాలి?

--
కొండల్ని, స్త్రీలని
ఎల్లప్పుడూ ప్రేమిస్తేనే
సూర్య విశ్రాంతి

--
నిశ్శబ్దం
సముద్రాలకి, కొండలకి తెలిసినట్టు
స్త్రీకే ఎందుకు తెలియదు

--
పగటి మేఘాల్ని చూసి
రాత్రి మేఘాలు ఎన్నడు
చలించాలిలే

--
జ్ఞాపకాలు
కన్నీళ్ళపై మిగిలిన
నేత్రాలు

2 comments:

karlapalem Hanumantha Rao said...

జ్ఞాపకాలు
కన్నీళ్ళపై మిగిలిన
నేత్రాలు
ముఖాలు లేని మేఘాలు
ఎక్కడున్నా దీవిస్తాయి
అర్హత ఎవరికి కావాలి?


మేఘాల రవిక
ఈ నీలి కొండలపై.
ఆకాశం తొంగిచూస్తోంది

కవిత్వాన్ని నిర్వచించటం కంటే ఆ కవిత రాసిన కాగితాలని చించి పారేయటం మేలు-అని ఎప్పుడో ఎవరో అన్న మాటలకు ఇప్పుడు కొద్ద్దిగా అర్ధం తెలుసు కున్నాను నాయుడు గారూ !యధాలాపంగా కూడలి లో తిరుగుతుంటే మీ పద చిత్రాలు కంట బడ్డాయి.మూడేసి ముక్కలలో ఎంత భావం దట్టించి వదిలారండీ మీరు !నా నోట్ బుక్ లో రాసుకున్నాను ఏనాటికైనా అక్కరకు రాక పోవా అని .ధన్యవాదాలు!

ఎం. ఎస్. నాయుడు said...

namaste. thank u sir.