ఇపుడు వొచ్చిన
రాత్రిని ఎలా పోమ్మనాలో
ఆకాశంతో ఏ కలా చెప్పదు
మనం చెప్పుకుంటున్నవన్నీ
అద్దం లోపలి మాటలే
ఏ కడలి చాయో
గాలి చలికి వణుకుతుంది
నా కన్నీళ్ల ఇంట్లో లేదు నిద్ర
నిద్ర పెదవుల్లో సూర్యాస్తమయాలు లేవు
కలలకి కళ్ళు దూరమే ...
ఆమె గొంతులో
ఓ చిన్న రాత్రి ఉదయిస్తోంది
మళ్లీ బతుకుతాను
ఈ రాత్రిలో
3 comments:
"ఓ చిన్న రాత్రి ఉదయిస్తోంది".
ఇక్కడ "ఉదయించడం" అనే పదానికి బదులు, వేరే పదం వాడితే బాగుండేది.
పై అనామకా,
Deconstruction is not a dismantling of the structure of a text, but a demonstration that it has already dismantled itself. Its apparently-solid ground is no rock, but thin air.
ఇది చూడండి : http://en.wikipedia.org/wiki/Deconstruction
ఉదయించడం అనే పదాన్ని, కవి రాత్రికి ఉపయోగించడం ద్వారా ఆ పదానికున్న pre-conceived Meaning ని ధ్వంసం చెస్తున్నాడు.
Please note that I am not a great of fan of this style but , we need to recognize that that he is the greatest experimental poet in Telugu scene in the current times.
sir, ee madhya mee kavithalalo kontha srikanth kavithma la untundhi. marola anukokandi. raju, hyderabad. ee raathri neeku, laanti kavithalo mukhyangaa alaa anipisthundhi. kaavaalani chesthunna prayathnama?
Post a Comment