Blog Archive

Followers

Saturday, November 20, 2010

ఎక్కడైనా

ఊపిరి లేని పదాలకై
పదాల లోపల పదాల వెతుకు

లోపలి శ్వాస
సువాసన లేని నిశ్వాస

ఎవరి ఆఖరికీ
ఉండని గాలి, గాలి

వాక్యం
వాలుతున్న పర్వతపుమొన

మేఘ
అవిశ్వాసం

కట్టకట్టుకుని అక్షరాలు యేవో
వేరే యేవో చెపుతాయి

మోకుల్లాంటి మాటలు

మాసిన పదాలతోనే
పురుడుకై వెళ్ళాలి

వాక్యం
అంతర్గత ఆత్మ హత్య

జనించే మృత్యువు
మరనేచ్చకై జీవిస్తుంది

వ్యాకరణ వాక్యాలతోనే
విషం నింపాలి

గొంతుకోసినా
ఊపిరి నీడ దక్కాలి

ఎప్పటి నిద్రలోకో
సూర్యకాంతి సాయంత్రానికి వస్తుంది

ఇంకొంత
ఈ పూట ఎక్కడైనా

ఊపిరిని వొదిలి రావాలి
ఎవరికీ తెలియనట్టు

6 comments:

karlapalem Hanumantha Rao said...

కట్టకుని.......(కట్టుకుని అని వుండాలా )
మొకుల్లాంటి మాటలు....(మోకులు కాదు కదా )
మరనేచ్చకై జీవిస్తుంది ....(మరణేచ్ఛకై అనుకోవచ్చా)ముద్రా రాక్షసలా ?...మరేదయిననా?
కవి భావం కమ్మగా గొంతులో కి జారే వేళ ఇవేవో పలుకుల్లా గుచ్చుకుంటున్నాయండి!కాస్త వీటి సంగతి కూడా చూడండి నాయుడు గారూ!
మొత్తం మీద కవిత మీ ముద్రా తో అదిరింది.

ఎం. ఎస్. నాయుడు said...

namaste sir. printing errors. pardon me. in a haste, composed & published.
thank you.

Everybody in the world said...

నాయుడూ
నువ్వు రాసిన అనేక మంచి (అంటే నాకు నచ్చిన అనుకో) కవితల్లో ఇదొకటి. నేను ఇంతకుముందే చెప్పినట్లు ఇదొక భాషలేని కవిత్వం. అయినా చిత్రం. చదువుతుంటే విచారమో నిర్విచారమో కలుగుతుంది. ఇది ఆహ్లాదభరితం కాదు. ఇందులో పూలు,పక్షులు,బాల్యం,జ్ఞాపకాలు దొరకవు. అలలమధ్య పొదిగే కలవలె క్షణమో యుగమో, జననమో మరణమో లిప్తకాలం పాటు జనించి మెరిసి తపించి నశించి ఎక్కడికో విసిరేస్తుంది. జననానికి మరణానికీ సువాసన ఏదైనా ఉంటే అది ఇదే అవుతుందేమో. ఇది ఎవరినీ సంతోషపెట్టదు. అయినా ఇదిలేకుండా ఉండలేరు. నిద్రపోరు. బందీలే కదా అందరూ. మరణ సుఖానికి- దుఖపు జననానికి

karlapalem Hanumantha Rao said...

జస్ట్ నా అనుమాన నివృత్తి కోసం అడిగానంతే నాయుడు గారూ!అయినా అకులు వెన్నెలనడ్డ గలవేమో గానీ చందమామ వెలుగునివ్వడం ఆపగలవా! ఇదీ అంతే .మీ కవితల గొప్పదనం మీదే!మీ కవిత్వాన్ని బాగా ఇష్టపడే వారిలో నేనూ ఒకడిని. ఈ రోజు నా బ్లాగ్ నాలోకం లోకి ఒక సారి తొంగి చూడండి సర్!మీకే అర్థమవుతుంది .

కోడూరి విజయకుమార్ said...

Dear Naidu...ever since u informed me of ur blog, i ve been following it. One thing i can say... many of the poems appeared in this blog are very nice than the poems in OKA VELLIPOTHAANU.....Keep writing..maroka vishayam.. ee madhya ekkuva baadhallo vunnaaraa..ekkuva kavitvam vosthondi....?

ఎం. ఎస్. నాయుడు said...

hi koduru. it's not like that. learning to write. thank u.