మాటలు లేవు చంద్రుడుకి భూమికి
ఇక ఆకాశ మధ్యవర్తిత్వమే ఫలించాలి
నదిని తోడుతున్నాడు జాలరి
పడవందుకే అతన్నే చేరదీసింది
ద్రవ పుష్పాలు హృదయంలో
పైకి వస్తే తెంపరూ
వెదుర పూల వయసొచ్చినా
ఇంకా అప్రయోజకుడ్నే
నదిలో మునకలేస్తూ
వేసవి చంద్రుడు
దూరమొచ్చానా దూరమయ్యానా
అని అశ్రు సంశయం
దిక్కుతోచని మేఘాలు
కొండెక్కి కలవరపడుతున్నాయి
సన్యసించే దుఃఖం లేదు
పరివ్రాజకుడా జీవించు
1 comment:
కొన్ని రాళ్ళే
మరికొన్ని కళ్ళు..
సూపర్.
Post a Comment