ద్రోహ స్వప్నాల్లో స్నేహితులు
శత్రువులు బతికే ఉంటారు
దిగులు హస్తాలతో
అక్షరాల హింసే కురూపి
మనసులో చర్మ వ్యాధులు
కీటకాల పాదాల కింద
వృత్త వివక్షలు
నివృత్త విషాదాలు
విశాల విలయాలు
వాయుగర్భ దహనంలో
ప్రారబ్ధ పునరుక్తి సంతోషాలు
ప్రాప్త దుఃఖాలు
వీడ్కోలు చెప్పే విధి వీధి
ఎక్కడుందో కొంచెం చెప్పరూ !
2 comments:
ఇప్పుడొస్తున్న కవితల్లో నాయిడు గారి కవితలు చాలా బాగుంటున్నాయి. తెలుగు కవితాలోకానికి ఓ ఆణిముత్యం నాయిడు గారు. ఇది ఇప్పుడు నేను చెబుతున్న మాట కాదు….’ఒక వెళ్ళిపొతాను ‘ తోనే ఋజువు చేసుకున్నారు. నాయిడు గారు మీ కవితల్లో క్లోరోఫాం వుంది. చదువుతుంటే ఏదో మైకం కలుగుతుంది. మైకంలో మీ మనో నేత్రాన్ని చూపిస్తున్నారు. మెలకువలేని నిద్రలో ఓ తీయటి స్వప్నం. లోలోపలే ఎన్నెనో అంతఃసంఘర్షణలు. మన్సుని ఇతగాడి కవిత్వం పట్టి కుదిపేస్తుంది. చలిస్తున్నానో జ్వలిస్తున్నానో తెలీకుండావుంది. ఏ ప్రపంచంలోకి అడుగు పెట్టామో అర్ధం కాకుండా వుంది. ఎక్కడున్నామో తెలుసుకోవాలన్న ప్రయత్నానికి వెనువెంటనే మొదలైయ్యే రెండో వాక్యం ఆలోచనల్ని గుక్క తిప్పుకోనీయడం లేదు. అందుకే నేనంటాను ఇది నాయిడు గారి అత్మ నివేదనని . కాదంటారా? కవితా వస్తువు మీకెలా దొరుకుతోంది? చాలా కాలం తర్వాత స్పందిస్తున్నందుకు క్షంతవ్యుణ్ని. మరొ చిన్న మాట…అంత డెప్త్ కి తీసుకునివెళ్ళి ఒక్కోసారి అకస్మాత్తుగా నిద్రలేపేస్తున్నారేమిటి?
అరుణ్ మరపట్ల
naa jaatakaanni baagaa cheppavu.
Post a Comment