అతుకుల ఆకలే, అంటుకట్టే ఆసరా దొరకదు
ఆత్మీయ అంతరిక్షంకేస, ఆనందాలన్నీ
అవహేలనా అహంకారంకింద, అణిగిమణిగి
అనంత అంతరంగానిక, అవధి ఏది
అలంకృత అన్ధత్వంలో, అశ్రువులు ఎవరివి
అంతటా అంతుచిక్కని చల్లటి వెలుతురు
సాగిలపడిన వెచ్చని చీకటి
శరీరాంతంలో చప్పటి చేదు నిశ్శబ్దం
చంపబడుతున్న ద్వేష శాంతి
చతికిలపడిన ఉమ్మనీటి బుడగ
ఇంకుతుండే మరణ స్వప్నం
కన్నీటి పోగుల అంచుల నుంచే ఆహ్వానం
వస్తావా!
4 comments:
మీ రాకతో బ్లాగులోకంలో కవితలకొక రూపం వచ్చింది. మీ ఆహ్వానం చాలా గొప్పది. బాగుంది సార్.
bagundi. rastoo vundandi.
http://dedicatedtocpbrown.wordpress.com/2010/02/26/detailed-account-of-the-jai-telangana-movement-of-1969-researched-and-arranged-event-wise/
అక్కసు ఆరాటం ఆక్రోశం ఆవేశం...
రాక పోకల ఆనవాలు లేని చీకటి ఇరుకు డొంక.
ఊపిరి సలపని ఉక్కిరిబిక్కిరి మైకపు ఆలింగనం.
విశ్వాంతరాళంలో వ్యాపించిన శబ్ద(పద) ఝరి కాఠిన్యం.
ఒకటిని రెండుగ చీల్చి ఒకటన్న భావన చెరిపి పారి ఏలిన
ఆమె సోయగం, ఆ దర్పం...
అనిర్వచనీయం అమోఘం అనంతం అమరం.
Post a Comment