చేపల ఇంటికి
సరిహద్దుల్ని పెట్టాను.
అలుపు లేకుండా
తలుపులులేని మలుపులుతో
సంసారించుకుంటుంటే,
వాటి ఇంటికి చిల్లు పెట్టాను.
నీటి పూతరేకులు కదా
నా ప్రాణాన్ని లుంగలు లుంగలుగా చుట్టిపడేశాయి.
ఈ చేప కళ్ళలోని అక్షరాలు
నా చివరి ఊపిర్ని తూర్పారపెడుతున్నాయి.
ఏ ఒక్క సరిహద్దూ లేనిచోట
ఓ ఆఖరి చేపనైనా వొదిలి పెట్టవూ!
1 comment:
బాగుందండి.
Post a Comment