ఓడిపో అని జీవితం ఎప్పుడూ చెప్పదు
దినదిన గండమే ప్రతి కృషీ విఫలమైతే
మార్పు కోరే ఎండమావులే అంతటా
అన్నింటా
ఇది విజయం అని మనసు ఎప్పటికీ చెప్పదే
రెక్కల చీకటి లేదు
గాలి కన్నులూ లేవు
తారీఖులు లేని రోజు ఒకటైనా ఉంటే
కనీసం విజయం ఇచ్చే సువాసనైనా అనుభవిస్తా
ఎప్పటి ఓటమైనా
ఆక్టోపస్ కౌగిలిలోనే
ఓడినవారికి
సమాధి లేదు
No comments:
Post a Comment