కొనలేనివి ఎన్నున్నా
ఆమె అడిగింది కొన్ని పూలనే
అవి ఎక్కడుంటాయో
అసలు దొరుకుతాయో లేదో
ఈ క్షణంలో
పూల వాసన గుర్తుకు రావట్లేదు
కాలశిల్పం దగ్గర
లభించేది ఏదీ లేదు
ఇక చివరి చీకటి
అంచులపై ప్రయాణించాలి
ఆతృత లేదు
ఆదుర్దా అంతకన్నా లేదు
పూల అవసరం దేనికి?
ఆనంద భంధనాలకా
దుఃఖ నిర్భంధనాలకా
ఆవేదనల విముక్తికా
కడసారి కన్నీల్లకా
ఎందుకైతేనేం
కొన్ని పూలున్న చోటికి వెళ్ళాలి
2 comments:
చాలా బాగుంది। ప్రత్యేకించి ముగింపు॥
సూపర్.
Post a Comment