ఒకప్పటి జ్ఞాపకమేదీ లేని ఆకాశం
నవ్వుల మబ్బులతో పిచ్చిగా వెళ్ళలేక
ఒకప్పటి మబ్బుల ఈకలు లేని ఆకాశం
జ్ఞాపకాల నవ్వులతో పిచ్చిగా పోలేక
నేలపై అవి చూసిన రోజుల్ని
రోజుల్ని మరిచిన నేలని
ఇప్పుడు నేనూ మరిచిపోయాను
ఒకానొక ఊరి ఊడల తాడులోంచి
వేలాడే జారిపోయాను
అయినా బతికున్నానని
బతకలేదు ఊరిని దాటేంత వరకు
ఇదిగో బయలు దేరాను
ఒకప్పుడు ఎగిరిన ఆకాశంలోకి
1 comment:
మన అకాడమీలకు ఇటువంటి కవిత్వం కనిపించకపోవటం దురదృష్టం.
Post a Comment